న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్ పార్దీవ్ పటేల్ అన్నాడు. బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన ఈ టెస్ట్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. చివరిసారిగా 1988లో ఇక్కడ న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది.
ఈ ఫలితంపై ఓ ఛానెల్‌లో మాట్లాడిన పార్దీవ్ పటేల్.. రోహిత్ శర్మ కెప్టెన్సీ తీరును తప్పుబట్టాడు. పిచ్ కండిషన్స్ సరిగ్గా అర్థం చేసుకోకుండా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం కెప్టెన్‌గా రోహిత్ శర్మ అతిపెద్ద తప్పిదం చేశాడన్నాడు. అంతేకాకుండా 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసే క్రమంలో బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని విమర్శించాడు.

చివరి రోజు ఆటలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆలస్యంగా బంతి అందించడంపై పార్దీవ్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'అశ్విన్‌ను ఆలస్యంగా బౌలింగ్‌కు తీసుకు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రధాన బౌలర్‌తో ఎక్కువ బౌలింగ్ చేయించాలి. అశ్విన్ కొత్త బంతితో బౌలింగ్ చేస్తాడా? అని మేం చర్చించుకున్నాం. ఎందుకంటే కొత్త బంతితో కూడా అశ్విన్ ప్రభావం చూపగలడు. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఆడటం బ్యాటర్లకు చాలా కష్టంగా ఉంటుంది.
అలాంటిది రోహిత్ శర్మ అతనికి బౌలింగ్ ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. అశ్విన్ వేసిన రెండు ఓవర్లలో కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్‌లో రెండు, మూడు సార్లు బ్యాటర్లు బీట్ అయ్యారు. కానీ అప్పటికే మ్యాచ్ భారత్ చేజారింది. మీడియా సమావేశంలో రోహిత్‌ను అశ్విన్ విషయంపై ప్రశ్నిస్తారని ఆశిస్తున్నా.'అని పార్దీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు రోహిత్ శర్మ.. ఫస్ట్ ఇన్నింగ్స్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని చెప్పుకొచ్చాడు. 46 పరుగులకే ఆలౌటవుతామని అస్సలు ఊహించలేదన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉందన్నాడు. సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ అద్భుతంగా ఆడారని చెప్పిన రోహిత్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ తరహాలోనే న్యూజిలాండ్‌తోనూ బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పాడు.
ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. తదుపరి 7 టెస్ట్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఒక టెస్ట్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి సమీకరణం లేకుండా టీమిండియా ఫైనల్ చేరాలంటే 4 మ్యాచ్‌లు గెలిచి.. మరో మ్యాచ్ డ్రా చేసుకోవాల్సిందే. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.