న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో రాణించాడు. కెరీర్‌లో ఫస్ట్ వన్డే హాఫ్ సెంచరీ అందుకున్న నితీష్ రెడ్డి తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు.
గ్లేన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్‌తో డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాది 52 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ వెంటనే పుష్ప సిగ్నేచర్ మూవ్ నీ అవ్వ.. తగ్గేదేలే అని బ్యాట్‌తో సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) తీవ్రంగా నిరాశపర్చడంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కు 88 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించాడు. ఫోక్స్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా నితీష్ కుమార్ రెడ్డి కొట్టిన భారీ సిక్సర్ అతని ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫిలిప్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే క్రిస్టియన్ క్లార్క్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో నితీష్ రెడ్డి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137), గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ శతకానికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి(57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ ఫోక్స్(3/77), క్రిస్టియన్ క్లార్క్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. జైడెన్ లెన్నాక్స్(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ జెమీసన్ ఒక వికెట్ తీసాడు.