For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. 36 ఏళ్ల తర్వాత టీమిండియాపై విజయం!

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య భారత్‌ను చిత్తు చేసింది. అద్భుతం చేస్తారని భావించిన భారత స్పిన్నర్లు చేతులెత్తేసారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది.

107 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ యంగ్(76 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్), రచిన్ రవీంద్ర(46 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

IND vs NZ New Zealand win 1st Test in India after 36 years take 1-0 lead in 3-match series

బుమ్రా ఒక్కడే..
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీసాడు. ఈ ఓటమితో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ పోరాటం వృథా అయ్యింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలో నిలిచింది. అక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. అనంతరం న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. రచిన్ రవీంద్ర(134) సెంచరీతో సత్తా చాటగా.. డెవాన్ కాన్వే(91), టీమ్ సౌథీ(65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.

IND vs NZ New Zealand win 1st Test in India after 36 years take 1-0 lead in 3-match series

సర్ఫరాజ్, పంత్ పోరాటం వృథా..
356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్(150) సెంచరీతో చెలరేగగా.. రిషభ్ పంత్(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. విరాట్ కోహ్లీ(70), రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓ రూర్కీ మూడేసి వికెట్లు తీయగా.. ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం.. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగడం.. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌటవ్వడం.. రెండో ఇన్నింగ్స్‌లో లోయరార్డర్ బ్యాటర్ల వైఫల్యం టీమిండియా కొంపముంచాయి.

Story first published: Sunday, October 20, 2024, 12:37 [IST]
Other articles published on Oct 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+