IND vs NZ: చెలరేగిన భారత బౌలర్లు.. 108 పరుగులకే కుప్పకూలిన కివీస్!

రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై మహమ్మద్ షమీ(3/18), హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) విజృంభించడంతో న్యూజిలాండ్ 34.3 ఓవర్లలోనే 108 పరుగులకే కుప్పకూలింది.
గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్‌వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది.
చెలరేగిన షమీ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు మహమ్మద్ షమీ గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఫిన్ అలెన్(0)ను మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పరుగుల ఖాతా తెరవకుండానే న్యూజిలాండ్ వికెట్ కోల్పోయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి లోనైన కివీస్ పూర్తిగా ఆత్మరక్షణలో ఆడింది.
అయితే ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్.. హెన్రీ నికోల్స్(2)ను స్లిప్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లో మహమ్మద్ షమీ.. డారిల్ మిచెల్(1)ను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
హార్దిక్ స్టన్నింగ్ క్యాచ్..
ఆ తర్వాత డెవాన్ కాన్వే(7)ను పాండ్యా స్టన్నింగ్ క్యాచ్‌తో ఔట్ చేయగా.. టామ్ లాథమ్ (1) శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. దాంతో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్, గత మ్యాచ్ సెంచరీ హీరో మైఖేల్ బ్రేస్‌వెల్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. 41 పరుగుల భాగస్వామ్యం తర్వాత సూపర్ బౌన్సర్‌తో డేంజరస్ బ్రేస్‌వెల్‌ను షమీ ఔట్ చేశాడు.

ఫిలిప్స్ పోరాడినా..
క్రీజులోకి వచ్చిన మిచెల్ సాంట్నర్‌తోనూ ఫిలిప్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ 47 పరుగుల భాగస్వామ్యం అనంతరం సాంట్నర్(27)ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ పతనం మొదలైంది. ఐదు పరుగుల వ్యవధిలోనే న్యూజిలాండ్ చివరి మూడు వికెట్లు కోల్పోయింది. గ్లేన్ ఫిలిప్స్, లాకీ ఫెర్గూసన్‌లను సుందర్ ఔట్ చేయగా.. బ్లైర్ టిక్‌నర్(2)ను కుల్దీప్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications