Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: మిచెల్ సాంట్నర్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన కోహ్లీ(వీడియో)

IND vs NZ: Mitchell Santner Takes Blinder To Dismiss Virat Kohli in Hyderabad ODI

హైదరాబాద్: వరుస సెంచరీలతో జోరు మీదున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన హైదరాబాద్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌తో ఉప్పల్ మైదానం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(8) తీవ్రంగా నిరాశపరిచాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ స్టన్నింగ్ డెలివరీకి విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏ మాత్రం ఊహించని రీతిలో వచ్చిన ఈ బంతికి విరాట్ కోహ్లీ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రోహిత్ శర్మ(34) ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. బౌండరీతో జోరు కనబర్చాడు. కానీ విరాట్ బలహీనతపై దెబ్బ కొట్టేందుకు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్.. స్పిన్నర్ అయిన మిచెల్ సాంట్నర్‌ను బరిలోకి దించాడు. భారత ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో విరాట్ ఔటయ్యాడు. ఈ ఓవర్ రెండో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. బ్యాక్ ఫూట్‌లో ఆడే ప్రయత్నం చేసిన విరాట్ కోహ్లీ.. బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు. విరాట్ బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్ వికెట్‌ను ముద్దాడింది. ఫ్రంట్ ఫూట్‌లో ఆడాల్సిన బంతిని లైన్ మిస్సైన విరాట్ బ్యాక్ ఫూట్‌లోకి వెళ్లి వికెట్ పారేసుకున్నాడు. ఈ స్టన్నింగ్ డెలివరీకి విరాట్ బిత్తరపోయాడు. ఆశ్చర్యకరంగా చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు.

కోహ్లీ అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(5) కూడా నిరాశపరిచాడు. రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 110 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(66 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అతనికి తోడుగా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. తనదైన షాట్లతో సూర్య అలరిస్తున్నారు. అంతకుముందు రోహిత్ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

Story first published: Wednesday, January 18, 2023, 15:30 [IST]
Other articles published on Jan 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+