బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. బౌలింగ్‌లో తాము ఒత్తిడికి గురయ్యామని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మిచెల్ సాంట్నర్..తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. బౌలింగ్‌లో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. మంచి ప్రాక్టీస్ లభించిందని తెలిపాడు.
'గెలవాలనే పట్టుదల ఉండాలి. ఈ రోజు మాకు మంచి ప్రాక్టీస్ లభించింది. గత రెండేళ్లుగా టీ20ల్లో భారత్ రికార్డ్ అద్భుతంగా ఉంది.గ్లేన్ ఫిలిప్స్, చాప్‌మన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి బ్యాటింగ్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. బౌలింగ్ విషయానికి వస్తే మేం కొంత ఒత్తిడికి గురయ్యాం. భారత్ లాంటి జట్టుపై తొలి బంతి నుంచే మేం అప్రమత్తంగా ఉండాలి.
భారత బ్యాటర్లు స్పిన్నర్లను టార్గెట్ చేయడంతో ఆఖరి ఓవర్‌ను డారిల్ మిచెల్‌తో వేయించాల్సి వచ్చింది. జాకబ్ డఫీ తన క్లాస్ ఏంటో నిరూపించుకున్నాడు. నేను ఇప్పటికీ 8వ స్థానంలోనే బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడుతాను. మా జట్టులోకి ఇంకా ఆటగాళ్లు రావాల్సి ఉంది.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌తో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32), రింకూ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(2/27), కైల్ జెమీసన్(2/54) రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులే చేసి ఓటమిపాలైంది. గ్లేన్ ఫిలిప్స్(40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/37), శివమ్ దూబే(2/28) రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా జరగనుంది.