IND vs NZ: బచాయించిన రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్.. పాపం గ్లేన్ ఫిలిప్స్!
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియాకు అదృష్టం కలిసొచ్చింది. 86/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఇచ్చిన సునాయస క్యాచ్‌లను న్యూజిలాండ్ ఫీల్డర్లు నేలపాలు చేశాడు.
హాఫ్ సెంచరీ ముంగిట 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శుభ్‌మన్ గిల్ ఇచ్చిన హై క్యాచ్‌ను న్యూజిలాండ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ చాప్‌మన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న శుభ్‌మన్ గిల్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిషభ్ పంత్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మ్యాట్ హెన్రీ అందుకోలేకపోయాడు. ఈ రెండు క్యాచ్‌లు గ్లేన్ ఫిలిప్స్ బౌలింగ్‌లోనే చేజారడం గమనార్హం. గ్లేన్ ఫిలిప్స్ వేసిన 27వ ఓవర్‌లో తొలి బంతిని భారీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాలని శుభ్‌మన్ గిల్ భావించాడు. కానీ బ్యాట్‌కు సరిగ్గా తగలని బంతి గాల్లోకి లేచింది. ఈ హై క్యాచ్‌ను న్యూజిలాండ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ చాప్‌మన్ అందుకోలేకపోయాడు.
గ్లేన్ ఫిలిప్స్ వేసిన 35వ ఓవర్‌లో మూడో బంతిని రిషభ్ పంత్ భారీ షాట్ ఆడాడు. ఫుల్‌టాస్‌గా వచ్చిన ఈ బంతిని లాంగాఫ్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మ్యాట్ హెన్రీ ఈ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. రెండు క్యాచ్‌లను నేలపాలు చేయడంతో గ్లేన్ ఫిలిప్స్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అయితే ఈ అవకాశాన్ని రిషభ్ పంత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరో బౌండరీ మాత్రమే బాది ఇష్ సోధీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇష్ సోధీ వేసిన 38వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ మూడో బంతిని సోధీ ఫ్లైట్ డెలివరీగా వేయగా.. పంత్ డిఫెన్స్ చేయబోయాడు. కానీ షార్ప్ టర్న్ తీసుకున్న బంతి అతని ప్యాడ్లకు తాకింది. ఫీల్డ్ అంపైర్ ఔటవ్విగా.. పంత్ రివ్యూ తీసుకున్నాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను మిస్సైనా.. అంపైర్స్ కాల్‌గా తేలింది. దాంతో పంత్ క్రీజును వీడాల్సి వచ్చింది. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 96 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి రవీంద్ర జడేజా రాగా.. టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.
Mark Chapman drops Gill at 36!
— OneCricket (@OneCricketApp) November 2, 2024
Matt Henry misses Pant at 53!
A Lucky day for India? 👀
📸: Jio Cinema#INDvNZ pic.twitter.com/iPVVWs1abU
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications