For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: నేను 6 నెలలు కూడా ఆడనన్నారు.. బుమ్రా భావోద్వేగం!

కెరీర్ ప్రారంభంలో తన విలక్షణమైన బౌలింగ్ చూసి తాను 6 నెలలు కూడా ఆడనని విమర్శించారని టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గుర్తు చేసుకున్నాడు. కానీ తాను అంతర్జాతీయ క్రికెట్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.

ఈ మూడో టీ20లో బుమ్రా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులిచ్చిన బుమ్రా.. డేంజరస్ టిమ్ సీఫెర్ట్‌తో పాటు మిచెల్ సాంట్నర్, కైల్ జెమీసన్‌లను పెవిలియన్ చేర్చాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా హోస్ట్‌తో మాట్లాడిన బుమ్రా.. పరోక్షంగా తన విమర్శకులకు చురకలంటించాడు. 6 నెలలు ఆడలేదన్నవారికి ఈ 10 ఏళ్ల ప్రదర్శనే సమాధామని తెలిపాడు.

IND vs NZ Jasprit Bumrah Silences Critics after Match winning Spell in 3rd T20I vs New Zealand

ఎక్కడైనా బౌలింగ్ చేయగలను..

'ఈ మ్యాచ్‌లో నేను బౌలింగ్ చేయడానికి రాక ముందు హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ఎలా బౌలింగ్ చేశారో, పిచ్ ఎలా స్పందిస్తుందో జాగ్రత్తగా గమనించాను. నేను బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు బంతి కాస్త పాతబడింది. సాధారణంగా వైట్ బాల్ ఎక్కువ సేపు స్వింగ్ కాదు. దాంతో ఈ పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు నేను చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నించాను. అది బాగా ఫలించింది.

నేను జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. మ్యాచ్ చివర్లో బౌలింగ్ చేయమన్నా.. కొత్త బంతి, పాత బంతితో ఎప్పుడూ బౌలింగ్ చేయడానికైనా నేను సిద్దం. ఆసియా కప్‌లోకూడా నేను భిన్నమైన వాతావరణంలో బౌలింగ్ చేశాను. జట్టు అవసరాలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం ముఖ్యం. నేను దానికి సిద్దంగా ఉన్నాను.

వీడు.. 6 నెలలు కూడా ఆడడు..

అంతర్జాతీయ క్రికెట్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. చిన్నప్పుడు భారత్ తరఫున ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని కలలు కనేవాడిని. కానీ 10 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆల్‌రౌండర్‌ను కాదు. ఫాస్ట్ బౌలర్‌ను. గాయాలు, నొప్పులు, ప్రజల నుంచి వచ్చిన విమర్శలను అధిగమించి నేను ఈ స్థాయికి వచ్చాను. నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు నా వినూత్నమైన బౌలింగ్ శైలిని చూసి 6 నెలలు కూడా ఆటలో కొనసాగడని విమర్శించారు. కానీ నేను దేశం తరఫున దశాబ్దపు కాలం ఆడినందుకు గర్వపడుతున్నాను. ఇది నా కెరీర్‌లో గొప్ప మైలురాయి. ఈ ప్రయాణం మరింత కాలం కొనసాగుతుందని ఆశిస్తున్నా.'అని జస్‌ప్రీత్ బుమ్రా భావోద్వేగానికి గురయ్యాడు.

Story first published: Monday, January 26, 2026, 9:48 [IST]
Other articles published on Jan 26, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+