Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఒక్క బంతికే 11 పరుగులు! (వీడియో)

భారత్ వర్సెస్ న్యూజిలాండ్‌ రెండో టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్ జాక్ ఫోక్స్ ఒక్క బంతికే 11 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు జాక్ ఫోక్స్ ఎక్స్‌ట్రాలు సంధించడంతో ఇది సాధ్యమైంది. ఈ ఓవర్‌లో ఇషాన్ కిషన్ నాలుగు బౌండరీలు, ఒక సిక్స్ బాది 24 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిందంటే..?

భారత ఇన్నింగ్స్ సందర్భంగా జాక్ ఫోక్స్ వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఇషాన్ కిషన్ ఓవర్ కవర్స్ దిశగా బౌండరీ బాదాడు. అయితే బంతి వేసే క్రమంలో ఫోక్స్.. నాన్ స్ట్రైకర్ స్టంప్స్‌ను పడేసాడు. దాంతో అంపైర్ నోబాల్ ఇవ్వగా.. టీమిండియాకు ఫ్రీహిట్ లభించింది. ఫ్రీహిట్ అడ్డుకోవాలనే ప్రయత్నంలో జాక్ ఫోక్స్ వరుసగా రెండు వైడ్స్ సంధించాడు.

మరుసటి బంతిని ఇషన్ కిషన్ లాంగ్ ఆఫ్ దిశగా బౌండరీ తరలించాడు. దాంతో ఒక లీగల్ డెలవరికి 11 పరుగులు(4nb, wd, wd, 4) వచ్చినట్లు అయ్యింది. అనంతరం మరో వైడ్ వేసిన ఫోక్స్.. తర్వాత రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇచ్చాడు. నాలుగో బంతిని బౌండరీ తరలించిన ఇషాన్ కిషన్.. ఐదో బంతిని డాట్ చేశాడు. ఆఖరి బంతిని ఫైన్ లెగ్ దిశగా సిక్సర్ బాది 24 పరుగులు పిండుకున్నాడు.

IND vs NZ Ishan Kishan Hits 11 Runs Off a Single Delivery Against Zakary Foulkes in 2nd T20I
Photo Credit: screen grab for JioHotstar

21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..

అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్.. జాకోబ్ డఫ్ఫీ మరుసటి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మూడు బాల్స్ డాట్ చేసిన ఇషాన్ కిషన్.. తర్వాతి మూడు బంతుల్లో వరుసగా మూడు బౌండరీలు కొట్టాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4 బాది 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

న్యూజిలాండ్ భారీ స్కోర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది.కెప్టెన్ మిచెల్ సాంట్నర్(27 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), రచిన్ రవీంద్ర(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44) రాణించారు. చివర్లో జాక్ ఫోక్స్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 15 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/35) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.

Story first published: Friday, January 23, 2026, 21:45 [IST]
Other articles published on Jan 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+