IND vs NZ: ఇషాన్ కిషన్ పిల్ల చేష్టలపై ఐసీసీ సీరియస్.. కాపాడిన అంపైర్లు! లేకుంటే..?

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పెద్ద గండం నుంచి గట్టెక్కాడు. సుమారు 12 వన్డేల నిషేధాన్ని తప్పించుకున్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తుంటరి పని చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ చేస్తుండగా.. కీపింగ్ గ్లోవ్స్‌తో బెయిల్స్ కిందపడేసి హిట్ వికెట్ అంటూ అప్పీల్ చేశాడు. టీవీ అంపైర్ పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి ఇషాన్ కిషన్ పనేనని గుర్తించాడు. దాంతో అందరూ నవ్వుకున్నారు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా టామ్ లాథమ్ సైతం ఇలానే చేయగా.. టీవీ అంపైర్ హార్దిక్ పాండ్యాను ఔట్ ఇస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ చేసిన ఈ తుంటరి పనిని అంతా మెచ్చుకున్నారు.

మండిపడిన మాజీ క్రికెటర్లు..
అయితే సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు మాత్రం ఇషాన్ కిషన్‌పై మండిపడ్డారు. ఈ ఘటన సమయంలో కామెంట్రీ చెబుతున్న గవాస్కర్.. ఈ పిల్ల చేష్టలు ఏంటని, ఇది క్రికెటే కాదని మండిపడ్డాడు. సరదా కోసం చేసినప్పుడు ఇషాన్ అప్పీల్ చేయాల్సింది కాదని మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ కూడా ఈ ఘటనపై కన్నెర్ర చేసింది. ఈ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్.. ఇషాన్ కిషన్‌ను మందలించాడు.

రూల్స్ ప్రకారం 12 మ్యాచ్‌లు నిషేధం..
ఐసీసీ నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఎవరైనా క్రికెటర్ ఇలా అంపైర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన శిక్షలు విధిస్తారు. ఆ తప్పు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.15 ప్రకారం.. ఇది లెవల్ 3 నేరం కిందకు వస్తుంది. కొన్నికొన్నిసార్లు ఈ నేరంలో ఆటగాడి మీద 4 నుంచి 12 వన్డేల వరకూ నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్‌పై నాలుగు వన్డేల నిషేధం తప్పదని న్యూజిలాండ్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి.

అంపైర్లు ఫిర్యాదు చేయకపోవడంతో...
కానీ శ్రీనాథ్ మాత్రం ఇషాన్‌ను మందలించి వదిలేసాడు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించాడు. అయితే శ్రీనాథ్ చర్యలు తీసుకోకపోవడానిక మరో కారణం కూడా ఉంది. ఈ ఘటనపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, నితిన్ మీనన్‌లు ఫిర్యాదు చేయకపోవడంతో శ్రీనాథ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోలేకపోయాడు. దాంతో అంపైర్ల సహకారంతో ఇషాన్ కిషన్ బతికిపోయాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అంపైర్లు కూడా ఈ ఘటనను సరాదాగా భావించారని అభిప్రాయపడుతున్నారు.

సిరీస్ కైవసం..
ఈ సిరీస్‌లో టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ వన్డేలో 12 పరుగులతో గట్టెక్కిన రోహిత్ సేన.. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 8 వికెట్లతో కివీస్‌ను చిత్తు చేసింది. చివరిదైన నామమాత్రపు వన్డే కోసం సిద్దమవుతోంది. ఇండోర్ వేదికగా మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంటే.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని న్యూజిలాండ్ అనుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications