For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: సంజూ.. నీ ఇలాకాలో నీ కెరీర్‌కే బొంద పెట్టాడుగా..!

టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రమోషన్ అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో వికెట్ కీపర్ కమ్ ఓపెనర్‌గా సంజూ శాంసన్ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా శనివారం జరిగిన ఐదో టీ20లో ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అంతర్జాతీయ టీ20‌ల్లో ఇషాన్ కిషన్ ఇదే తొలి సెంచరీ. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ కెరీర్‌కు ఇషాన్ కిషన్ ముగింపు పలికాడు.

సంజూ చాప్టర్ క్లోజ్

ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 10, 6, 0, 24, 6 దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఒకే తరహా తప్పిదంతో వెనుదిరిగాడు. ఓవైపు పేలవ బ్యాటింగ్.. మరోవైపు ఇషాన్ కిషన్ విధ్వంసంతో సంజూ కెరీర్ ప్రమాదంలో పడింది. ఆఖరి టీ20 రెండో ఇన్నింగ్స్‌తో సంజూ చాప్టర్ క్లోజ్ అనే సంకేతాలను మేనేజ్‌మెంట్ ఇచ్చింది.

గత నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్‌గా కొనసాగిన సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌తో కీపింగ్ చేయించింది. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. మెగా టోర్నీలో సంజూ శాంసన్ మరోసారి బ్యాకప్ ప్లేయర్‌గానే జట్టులో కొనసాగనున్నాడు. 12వ ఆటగాడిగా వాటర్ బాటిల్స్ మోయనున్నాడు.

IND vs NZ Ishan Kishan s 42-Ball Century Sparks Debate Over Sanju Samson s Future in Team India

ఇషాన్ కిషన్ సరైనోడు..

ఈ నిర్ణయాన్ని ఎవరూ కూడా తప్పుపట్టలేని పరిస్థితిని ఇషాన్ కిషన్ కల్పించాడు. దేశవాళీ క్రికెట్‌లో సంచలన ప్రదర్శన కనబర్చి రెండున్నరేళ్ల తర్వాత అనూహ్యంగా భారత టీ20 జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. తిలక్ వర్మ గైర్హాజరీలో అవకాశం అందుకొని సత్తా చాటాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా రెండో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మూడో టీ20లో క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్..చిన్న గాయంతో నాలుగో టీ20కి దూరంగా ఉన్నాడు. ఆఖరి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 10 సిక్స్‌లు 6 ఫోర్లతో 42 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 245 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

ఇషాన్ శతకంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మెరుపులు మెరిపించారు. భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు. జాకోబ్ డఫీ(1/53), కైల్ జెమీసన్(1/59), మిచెల్ సాంట్నర్(1/60) హాఫ్ సెంచరీలు సమర్పించుకోగా. లాకీ ఫెర్గూసన్(2/41) కాస్త కట్టడిగా బౌలింగ్ చేశాడు.

Story first published: Saturday, January 31, 2026, 22:15 [IST]
Other articles published on Jan 31, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+