టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రిషభ్ పంత్ భారీ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
టీమ్ సౌథీ వేసిన 61 ఓవర్ తొలి బంతిని పంత్ లాంగాఫ్ దిశగా సిక్సర్ బాదాడు. సౌథీ వేసిన లెంగ్త్ బాల్‌ను సైట్ స్క్రీన్ దిశగా సిక్సర్ తరలించాడు. అనంతరం ఆజాజ్ పటేల్ వేసిన 66వ ఓవర్‌లో పంత్ మరో రెండు సిక్స్‌లు బాదాడు. తనదైన శైలిలో స్టెప్ ఔటై.. భారీ సిక్స్‌లు కొట్టాడు.

ఈ ఓవర్ తొలి బంతిని ఆజాజ్ పటేల్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. పంత్ స్టెప్ ఔటై లాంగాన్ దిశగా సిక్సర్ తరలించాడు. అనంతరం డాట్ చేసిన పంత్ మూడో బంతిని ఇదే తరహాలో బౌలర్ తలపై నుంచి సిక్సర్ తరలించాడు. మోకాలి గాయంతో మైదానం వీడిన పంత్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా సిక్సర్లు బాదాడు. రిషబ్ పంత్ సిక్సర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు బిత్తరపోయారు.
అభిమానులు అయితే పంత్ సిక్సర్లను తెగ ఎంజాయ్ చేశారు. చిన్నస్వామి స్టేడియం రిషభ్ పంత్ సూపర్ బ్యాటింగ్‌కు దద్దరిల్లింది. రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్ వీరోచిత శతకంతో.. టీమిండియా నిలకడగా ఆడుతోంది. 231/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. 68 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లకు 326 పరుగులు చేసింది. రిషభ్ పంత్(43 బ్యాటింగ్)తో పాటు సర్ఫరాజ్ ఖాన్(118 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టీమిండియా ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
THE RISHABH PANT SPECIAL AT CHINNASWAMY.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024
- A clean strike from Pant. 🔥pic.twitter.com/l0vYf7ZPfu