న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పేలవ బ్యాటింగ్‌తో సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లోనే అదే తడబాటు కొనసాగిస్తోంది. 8 బంతులు.. 6 పరుగుల వ్యవధిలోనే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 4 వికెట్లకు 86 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(18), యశస్వి జైస్వాల్(30), నైట్ వాచ్ మ్యాన్ మహమ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లీ(4) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్( 1 బ్యాటింగ్) ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు. బౌలింగ్‌లో సత్తా చాటమనే ఆనందాన్ని భారత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నీరు గార్చారు.
డీఎస్పీ సిరాజ్ గోల్డెన్ డక్..
నైట్ వైచ్‌మన్‌గా పంపించిన డీఎస్పీ సిరాజ్ గోల్డెన్ డక్ అయ్యాడు. అనవసర రివర్స్ స్వీప్ షాట్‌తో యశస్వి జైస్వాల్ వికెట్ పారేసుకోవడంతో రెండో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తొలి రోజు ముగియడానికి మరికొన్ని ఓవర్లు మాత్రమే ఉండటంతో టీమిండియా మేనేజ్‌మెంట్ మహమ్మద్ సిరాజ్‌ను నైట్‌వాచ్‌మన్‌గా పంపించింది.
అతను ఎదుర్కొన తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. షార్ప్ టర్న్ తీసుకున్న బంతి సిరాజ్ బ్యాట్‌ను మిస్సై తన రెండో కాలికి తాకుతూ కీపర్ చేతిలో పడింది. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. సిరాజ్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి విక్లటను క్లియర్‌గా హిట్ చేసింది. సిరాజ్ గోల్డెన్ డకౌటవ్వడంతో పాటు ఒక రివ్యూను కూడా వృథా చేశాడు.
సిరాజ్ ఎందుకు..?
పిచ్ స్పిన్‌కు సహకరిస్తున్న సమయంలో సిరాజ్‌ను బ్యాటింగ్‌కు ఎందుకు పంపారని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. సిరాజ్‌కు బదులు అశ్విన్‌ను లేదా కోహ్లీని పంపించినా పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సిరాజ్ గోల్డెన్ డకౌటవ్వడం వల్ల టీమిండియా బ్యాటర్లపై అనవసర ఒత్తిడి నెలకొందని, దాంతోనే కోహ్లీ వికెట్ కోల్పోవాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు. ఇక కోహ్లీ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటైన విషయం తెలిసిందే.
డీఎస్పీ.. వాచ్‌మనా?
మరోవైపు సిరాజ్ గోల్డెన్ డకౌట్‌పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. తెలంగాణ డీఎస్పీ అయిన సిరాజ్‌ను వాచ్‌మన్‌గా పంపిస్తే ఇలానే అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆట చివర్లో వికెట్లను కాపాడుకునేందుకు టెయిలెండర్స్‌ను బ్యాటింగ్ పంపిస్తారు.
ఇలా బ్యాటింగ్‌కు వచ్చే వారిని నైట్ వాచ్‌మన్ అని పిలుస్తారు. వికెట్లు పడకుండా ఆటను ముగించడమే వీరి కర్తవ్యం. కానీ సిరాజ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి టీమిండియాకు తీవ్ర నష్టం చేశాడు. అటు బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ తీయలేకపోయాడు.
It's time for DSP Siraj to arrest the nightwatchman Siraj for wasting a review 💀 pic.twitter.com/MI3MxyxljQ
— Dinda Academy (@academy_dinda) November 1, 2024
Bro came as night watchman
— Riseup Pant (@riseup_pant17) November 1, 2024
Wasted review
Went back to pavilion
Aura of Sir Mohammed Siraj 😭🔥#INDvNZ #CricketTwitter pic.twitter.com/TMiUZ7WLLN
Shri shri shri Siraj coming 2 down just to play 1 ball and wasting 1 review. #dsp pic.twitter.com/2ZPbod1ezL
— Jeet (@hashlenabro) November 1, 2024