Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ.. కుప్పకూలిన న్యూజిలాండ్!

IND vs NZ: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(5/54) నిప్పులు చెరిగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 130) సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఈ ఇద్దరు మినహా మరే బ్యాటర్ చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. భారత బౌలర్లలో షమీకి తోడుగా కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.

IND vs NZ: India restrict New Zealand 273 after Mohammed Shami 5 wicket Haul

శుభారంభం లేకున్నా..:టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ డెవాన్ కాన్వే(0)ను మహమ్మద్ సిరాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ టోర్నీలో ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ తొలి బంతికే షమీ.. విల్ యంగ్(17)ను క్లీన్ బౌల్డ్ చే‌సాడు. దాంతో 19 పరుగులకే న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర ఆచితూచి ఆడారు.

దాంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 34 పరుగులే చేసింది. షమీ వేసిన 11వ ఓవర్‌లో రచిన్ రవీంద్ర ఇచ్చిన సునాయ క్యాచ్‌ను జడేజా నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను భారత స్పిన్నర్లను అటాక్ చేశాడు. భారీ షాట్లతో దూకుడు కనబర్చాడు. డారిల్ మిచెల్ సైతం ధాటిగా ఆడటంతో కివీస్ వేగంగా పరుగులు చేసింది.

మూడు క్యాచ్‌లు నేలపాలు..:ఈ క్రమంలో రచిన్ రవీంద్ర 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. డారిల్ మిచెల్ 60 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక జడేజా బౌలింగ్‌లో మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ అందుకోలేకపోయాడు. ఈ అవకాశంతో రెచ్చి పోయిన డారిల్ మిచెల్... కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మరో అవకాశం ఇచ్చాడు. కానీ బౌండరీ లైన్ వద్ద జస్‌ప్రీత్ బుమ్రా నేలపాలు చేశాడు.

IND vs NZ: India restrict New Zealand 273 after Mohammed Shami 5 wicket Haul

భారీ భాగస్వామ్యంతో దూసుకుపోతున్న ఈ జోడీని షమీ విడదీసాడు. రచిన్ రవీంద్రను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్(5)ను కుల్దీప్ యాదవ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కివీస్ పరుగుల వేగం తగ్గింది. ఫిలిప్స్ సాయంతో ఆచితూచి ఆడిన మిచెల్ 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

గ్లేన్ ఫిలిప్స్‌(23)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. మార్క్ చాప్‌మన్‌(6)ను కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో బుమ్రా ఔట్ చేశాడు. వరుస బంతుల్లో మహమ్మద్ షమీ మిచెల్ సాంట్నర్‌(1), మ్యాట్ హెన్రీ(0)లను క్లీన్ బౌల్డ్ చేశాడు.భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసిన డారిల్ మిచెల్‌ను షమీ క్యాచ్ ఔట్ చేసి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆఖరి బంతికి లేని పరుగుకు ప్రయత్నించిన ఫెర్గూసన్(1) రనౌటవ్వడంతో న్యూజిలాండ్ ఆలౌటైంది.

Story first published: Sunday, October 22, 2023, 18:11 [IST]
Other articles published on Oct 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+