న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 2 ఫోర్లతో 20), యశస్వి జైస్వాల్(63 బంతుల్లో ఫోర్‌తో 13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.
న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/15), విలియమ్ ఓ రౌర్కే(4/22), టీమ్ సౌథీ(1/8) భారత్ పతనాన్ని శాసించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియాకు ఇదే లోయేస్ట్ స్కోర్. అంతేకాకుండా టెస్ట్ ఫార్మాట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇదే అత్యంత తక్కువ స్కోర్.

2021లో ఇదే న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 62 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇదే లోయెస్ట్ స్కోర్‌గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్ (46 ఆలౌట్) ఈ చెత్త రికార్డును అధిగమించింది. ఓవరాల్‌గా టీమిండియాకు ఇది రెండో అత్యల్ప స్కోర్. నాలుగేళ్ల క్రితం అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగులకు కుప్పకూలింది. 1974లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులకు ఆలౌటైంది.
ఆసియా గడ్డపై అత్యల్ప టెస్ట్ స్కోర్ నమోదు చేసిన జట్టుగా కూడా టీమిండియా అప్రతిష్టను మూటగట్టుకుంది. 1986లో ఫైసలాబాద్ పాకిస్థాన్‌తో వెస్టిండీస్ 53 పరుగులకు కుప్పకూలింది. 2002లో షార్జా వేదికగా ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కూడా 53 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటి వరకు ఆసియాలో ఇవే అత్యల్ప స్కోర్లుగా ఉండగా.. తాజాగా టీమిండియా ఈ చెత్త రికార్డ్‌ను అధిగమించింది.
మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట వర్షార్పణమైంది. భారీ వర్షం కారణంగా టాస్ కూడా సాధ్యం కాలేదు. రెండో రోజు ఆట సాధ్యమవ్వగా.. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ అనూహ్యంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడం.. వికెట్‌పై కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ వచ్చి స్వింగ్ అవ్వడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్ చేరారు.