For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డ్!

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా చెత్త రికార్డ్ కొనసాగుతోంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా 15 మ్యాచ్‌ల్లో టాస్ ఓడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడటం ద్వారా టీమిండియా ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ క్రమంలో తమ పేరిట ఉన్న చెత్త రికార్డ్‌నే రోహిత్ సేన మరింత మెరుగుపరుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనే వరుసగా 15 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన తొలి జట్టుగానూ టీమిండియా నిలిచింది. టీమిండియా తర్వాత నెదర్లాండ్స్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. నెదర్లాండ్స్ జట్టు 2011-2014 మధ్య వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడింది.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డ్..
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌తో సహా టీమిండియా వరుసగా 15 వన్డేల్లో టాస్ ఓడింది. ఈ 15 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 12 సార్లు టాస్ ఓడగా.. మరో మూడు సార్లు కేఎల్ రాహుల్ టాస్ గెలవలేదు. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డ్‌ను నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వెస్టిండీస్ దిగ్గజ సారథి బ్రియాన్ లారాను సమం చేశాడు. లారా 1998-99 మధ్య వరుసగా 12 మ్యాచ్‌ల్లో టాస్ ఓడాడు. పీటర్ బోరెన్( 2011-13) 11 సార్లు టాస్ ఓడి తర్వాతి స్థానంలో ఉన్నాడు.

IND vs NZ India Creates Unwanted ODI Record During Champions Trophy 2025 Final Against New Zealand

15 నెలలుగా..
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు ఆడింది. ఈ సిరీస్‌లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించాడు. అతను మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడాడు. ఆ తర్వాత శ్రీలంకతో గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో మూడు వన్డేలు ఆడిన టీమిండియా.. మూడింటిలో టాస్ గెలవలేదు. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన మూడు వన్డేల్లోనూ టీమిండియా టాస్ గెలవలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌తో సహా మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడింది.

ఈ 15 మ్యాచ్‌ల్లో టీమిండియా 9 విజయాలు సాధించడం గమనార్హం. టీమిండియా చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది. దాదాపు 15 నెలలుగా టాస్ గెలవలేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ ఉండటంతో టీమిండియా మూడే వన్డేలు ఆడింది. దాంతో ఈ చెత్త ఫీట్‌ను తమ పేరిట లిఖించుకుంది.

ఒరిగేది ఏం లేదు..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. భారీ స్కోర్ నమోదు చేసి టీమిండియాను కట్టడి చేస్తామని చెప్పాడు. మరోవైపు టాస్ ఓడిపోవడం వల్ల తమకు ఒరిగేది ఏం లేదని రోహిత్ శర్మ తెలిపాడు. ఇప్పటికే ఈ పిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేసి విజయాలు సాధించామని చెప్పాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టునే విజయం వరిస్తుందని, టాస్‌తో పని ఉండదని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. న్యూజిలాండ్ ఒక మార్పు చేసింది. గాయపడ్డ మ్యాట్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్‌ను తీసుకుంది.

Story first published: Sunday, March 9, 2025, 14:58 [IST]
Other articles published on Mar 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+