టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరే జట్టు అందుకోని అరుదైన ఘనతను సాధించింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు నమోదు చేసిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు.
న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన భారీ సిక్సర్‌తో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో స్టెప్ ఔటైన కోహ్లీ.. ఫ్రంట్ ఫుట్‌లో లాంగాన్ దిశగా అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఈ సిక్స్‌తో టీమిండియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 72 సిక్స్‌లు నమోదు చేసింది. ఇందులో యశస్వి జైస్వాల్ ఒక్కడే 26 సిక్స్‌లు కొట్టాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో మరిన్ని సిక్స్‌లు కొట్టిన టీమిండియా.. తాజా మ్యాచ్‌లో 100 సిక్స్‌ల మైలురాయిని పూర్తి చేసుకుంది.
ఈ ఏడాది 17 ఇన్నింగ్స్‌లు ఆడిన టీమిండియా.. ఇప్పటి వరకు 102 సిక్స్‌లు బాదింది. ఈ జాబితాలో టీమిండియా తర్వాత ఇంగ్లండ్ 2022లో 89 సిక్స్‌లతో రెండో స్థానంలో నిలవగా.. ఇండియా 2021లో 87, న్యూజిలాండ్ 2014లో 81, న్యూజిలాండ్ 2013లో 71 తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
బెంగళూరు టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు టీమిండియా మొత్తం ఐదు సిక్స్‌లు బాదింది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెరొక సిక్స్ కొట్టగా.. సర్ఫరాజ్ ఖాన్ మూడు సిక్స్‌లు బాదాడు. ఈ ఏడాది ముగిసేలోపు టీమిండియా ఈ రికార్డ్‌ను మరింత మెరుగు చేసుకోనుంది. 150 సిక్స్‌ల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70), సర్ఫరాజ్ ఖాన్(78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు. టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది.