For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: న్యూజిలాండ్ 255 ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 359 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. 198/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్.. మరో 57 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది.

ఓవర్‌నైట్ బ్యాటర్లు టామ్ బ్లండెల్(41), గ్లెన్ ఫిలిప్స్(48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని రవీంద్ర జడేజా స్టన్నింగ్ డెలివరీతో విడదీసాడు. టామ్ బ్లండెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టీమ్ సౌథీ(0) అశ్విన్ ఔట్ చేయగా.. అజాజ్ పటేల్(1), విలియమ్ ఓ రూర్కీ(0)లను జడేజా పెవిలియన్ చేర్చి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

IND vs NZ India Bowl Out New Zealand For 255 Need 359 To Win Pune Test

న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ లాథమ్(133 బంతుల్లో 10 ఫోర్లతో 86)టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(4/56) నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.

అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్‌తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38), యశస్వి జైస్వాల్(30), శుభ్‌మన్ గిల్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దాంతో న్యూజిలాండ్‌కు 103 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Story first published: Saturday, October 26, 2024, 11:03 [IST]
Other articles published on Oct 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+