IND vs NZ: ప్చ్.. పృథ్వీ షాకు దక్కని చోటు! హార్దిక్ పాండ్యా బేఖార్ నిర్ణయం!

అహ్మదాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. భారీ స్కోర్ చేసి న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనుకుంటున్నామని తెలిపాడు. ఈ మైదానం తనకు హోమ్ గ్రౌండ్ లాంటిదని, ఇక్కడే తాము ఐపీఎల్ ఫైనల్ ఆడామని చెప్పాడు.సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇక్కడ బాల్ టర్న్ అవుతుందన్నాడు.

ఉమ్రాన్ మాలిక్..
గత రెండు మ్యాచ్‌ల్లో కఠినమైన పిచ్‌లపై తమ బ్యాటర్లు అద్భుతంగా రాణించారని తెలిపాడు. తమ బ్యాటింగ్ అప్రోచ్ కూడా బాగుందన్నాడు. తమకు ఈ మ్యాచ్ ఓ పరీక్షలాంటిదని, ఈ మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకుంటామని తెలిపాడు. ఇలాంటి నాకౌట్స్ గేమ్స్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నాడు.
జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన హార్దిక్ పాండ్యా.. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. పేస్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని హార్దిక్ తెలిపాడు. ఇక అవకాశం కోసం ఎదురు చూసిన యువ ఓపెనర్ పృథ్వీ షాకు మరోసారి మొండి చెయ్యే ఎదురైంది.

ఫీల్డింగ్ తీసుకునేవాళ్లం..
ఇక తాము టాస్ గెలిస్తే బౌలింగ్ చేసేవాళ్లమని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తుందన్నాడు. లక్నో పిచ్ సవాల్ విసిరిందన్నాడు. ఆ వికెట్‌పై 120 పరుగులు చేస్తే సరిపోయేదని తెలిపాడు. అయినా కండిషన్స్‌ను అందిపుచ్చుకొని గట్టి పోటీనిచ్చామని చెప్పాడు.
ఈ మైదానంలో ఆడటం ఇదే తొలిసారని చెప్పిన మిచెల్ సాంట్నర్.. ఇదో గొప్ప అనుభవమని చెప్పుకొచ్చాడు. పెద్ద బౌండరీలకు తగ్గట్లు తమ ప్లేయర్లు ఆడాల్సి ఉందన్నాడు. జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన సాంట్నర్.. జకోబ్ డఫ్పీ స్థానంలో బెన్ లిజర్ వచ్చాడని చెప్పాడు.
చేజింగ్‌కు అనుకూలమైనా..
పిచ్ రిపోర్ట్‌లో వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరి టర్నింగ్ ఉండదని హోస్ట్ అజిత్ అగార్కర్ తెలిపారు. డ్యూ నేపథ్యంలో చేజింగ్ చేసే టీమ్‌కు అడ్వాంటేజ్ ఉంటుందన్నారు. కానీ హార్దిక్ మాత్రం బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కామెంటేటర్లు సైతం హార్దిక్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని విమర్శించారు.

తుది జట్లు:
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), మార్క్‌చాప్‌మన్, గ్లేన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోదీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిజర్, బ్లెయిర్ టక్‌నర్
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషాన్(కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications