For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: ఒక్క స్థానం కోసం పోటీలో మూడు జట్లు.. అలా అయితేనే సెమీస్​కు భారత్!!

IND vs NZ: Here is Team Indias chances of reaching the semi-finals of T20 World Cup 2021

హైదరాబాద్: ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 రసవత్తరంగా సాగుతోంది. అగ్రశ్రేణి జట్లతో పాటు పసికూన టీంలు కూడా విజయం కోసం చివరిబంతి వరకు పోరాడుతున్నాయి. ఈ క్రమంలో గ్రూప్​ 1లో కంటే.. గ్రూప్​ 2లో సెమీస్ రేసు రసవత్తరంగా ఉంది. అఫ్గానిస్థాన్​పై విజయంతో గ్రూప్​ 2 టేబుల్​ టాపర్​గా ఉన్న పాకిస్థాన్ దాదాపు​ సెమీస్​కు చేరినట్లే. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్​పై గెలిచిన పాక్.. ఇక పోటీపడాల్సింది చిన్న దేశాలైన స్కాట్​లాండ్, నమీబియా పైనే. మిగిలి ఉన్న ఒకే ఒక్క సెమీస్​ బెర్తు కోసం స్కాట్​లాండ్, నమీబియా జట్లకు అవకాశం లేదని భావించినా.. పోటీ ప్రధానంగా టీమిండియా, న్యూజిలాండ్​, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఉంది.

రెండు మ్యాచులు గెలవాల్సిందే

రెండు మ్యాచులు గెలవాల్సిందే

టీ20 ప్రపంచకప్ 2021లో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్​, అఫ్గానిస్థాన్​ ఒక దానితో మరొకటి పోటీ పడలేదు. భారత్ ఆదివారం న్యూజిలాండ్​తో తలపడనుంది. అఫ్గానిస్థాన్​తో నవంబర్​ 3న కోహ్లీసేన తలపడనుంది. నవంబర్​ 7న కివీస్​, అఫ్గాన్ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ మూడు మ్యాచుల అనంతరం సెమీస్​ చేరే జట్లపై పూర్తి స్పష్టత రానుంది. భారత్ సెమీస్​కు చేరాలంటే.. న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్​తో జరిగే మ్యాచుల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అలా అయితేనే కోహ్లీసేన సెమీస్​కు చేరుకుంటుంది. ఒక మ్యాచ్ ఓడినా కోహ్లీసేన ఆశలు ఆవిరికానున్నాయి.

ఒకదానిపై గెలిచి.. మరో దాంట్లో ఓడితే

ఒకదానిపై గెలిచి.. మరో దాంట్లో ఓడితే

టీమిండియా, న్యూజిలాండ్​, అఫ్గానిస్థాన్ జట్ల పోరులో రెండు మ్యాచ్​లు గెలిచే జట్టు సెమీస్​ రేసులో ముందంజ వేస్తుంది. అలా కాకుండా ఒకదానిపై గెలిచి.. మరో జట్టు చేతిలో ఓడితే మూడు జట్లు ఒక్కొక్కటి గెలిచినట్టు అవుతుంది. అప్పుడు నెట్​ రన్​రేట్​పై ఆధారపడాల్సి వస్తుంది. సెమీస్​కు ప్రధానంగా న్యూజిలాండ్​, భారత్ ఫేవరెట్​గా కనిపిస్తున్నా.. ​టాప్​2లో నిలిచేందుకు తాము కూడా ఉన్నామని అద్భుత ప్రదర్శనతో అఫ్గాన్ ఇప్పటికే చాటిచెప్పింది. నిజం చెప్పాలంటే.. ఈరోజు రాత్రి జరిగే మ్యాచుతో సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం కానుంది. చూడాలి న్యూజిలాండ్​ గెలుస్తుందో లేదా భారత్ విజయం సాధిస్తుందో.

IND vs NZ: డ్యాన్స్ ఇరగదీసిన ఇషాన్, శార్దుల్.. దేవకన్యలా వామిక (వీడియో)!!

18 ఏళ్లుగా కివీస్‌కు ఎదురులేదు

18 ఏళ్లుగా కివీస్‌కు ఎదురులేదు

టీ20 ప్రపంచకప్‌ 2021లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లూ తప్పక గెలవాలి. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనుంది. అయితే ఇప్పుడు భారత అభిమానులను ఓ విషయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అదే గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియాపై కివీస్‌కు ఎదురులేకపోవడం.

ఈసారి కూడా కివీస్ విజయం సాధిస్తే.. ఇక కోహ్లీసేన సెమీస్‌ ఆశలు గల్లంతైనట్లే. ఈ నేపథ్యంలో ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే భారత్‌ గతేడాది న్యూజిలాండ్‌ పర్యటనను గుర్తుతెచ్చుకోవాలి. ముఖ్యంగా ఐదు టీ20ల సిరీస్‌ను. అప్పుడు కివీస్‌పై ఎలా గెలిచారో భారత ఆటగాళ్లు ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. జట్టులో నూతనోత్తేజం కలిగే అవకాశం ఉంది.

ఐసీసీ టోర్నీల్లో కివీస్‌కు చెక్‌ పెట్టాలని

ఐసీసీ టోర్నీల్లో కివీస్‌కు చెక్‌ పెట్టాలని

గతేడాది భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. అయితే టీ20 సిరీస్‌లో చెలరేగిన కోహ్లీసేన.. వన్డేల్లో, టెస్టుల్లో వరుస ఓటములు చవిచూసింది. అయితే టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడమే ఇప్పుడు భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సిరీస్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలలో ఒకరు విఫలమైనా.. మరొకరు జట్టును ఆదుకున్నారు.

అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ పరుగులు చేసి జట్టుకు సిరీసును అందించారు. జస్ప్రీత్ బుమ్రా కూడా రెండుసార్లు సూపర్‌ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ అలాంటి పట్టుదలే ప్రదర్శిస్తే కివీస్‌తో పోరులో విజయం తధ్యమే. కోహ్లీసేన ఆ సిరీస్‌ను గుర్తుచేసుకొని ఇకపై ఐసీసీ టోర్నీల్లో కివీస్‌కు చెక్‌ పెట్టాలని మనం ఆశిద్దాం.

Story first published: Sunday, October 31, 2021, 14:03 [IST]
Other articles published on Oct 31, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+