For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ:పాపం పృథ్వీ షా.. హార్దిక్ పాండ్యా రాజకీయాలకు బలి! ఫ్యాన్స్ ఫైర్!

IND vs NZ: Hardik Pandya trolled after Prithvi Shaw misses out in 2nd T20 against New Zealand

లక్నో: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో కీలకమైన రెండో టీ20లో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగడాన్ని తప్పుబడుతున్నారు. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లకు అవకాశమిస్తూ.. సత్తా చాటిన ఆటగాళ్లను బెంచ్‌పై కూర్చోబెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు. రంజీ ట్రోఫీలో విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో 18 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చిన పృథ్వీ షాకు వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అవకాశం దక్కలేదు. మరోవైపు గత 12 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ చేయని ఇషాన్ కిషన్, దీపక్ హుడా.. టీ20 ఫార్మాట్‌కు ఏమాత్రం సెట్ అవ్వని శుభ్‌మన్ గిల్‌లకు వరుసగా అవకాశాలు ఇవ్వడాన్ని అభిమానులు సహించలేకపోతున్నారు.

లాజిక్ లేని మార్పు..

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగిన టీమిండియా.. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకుంది. పిచ్‌పై టర్న్ ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టాస్ సందర్భంగా హార్దిక్ పాండ్యా తెలిపాడు. దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉండగా మరో స్పిన్నర్ ఎందుకని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. బ్యాటింగ్ డెప్త్ విషయంలో టీమిండియా ఫోకస్ చేయాల్సిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. తొలి టీ20 అనంతరం వసీం జాఫర్ వంటి మాజీ ఆటగాళ్లు సైతం ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగాలని సూచించారు. పృథ్వీ షా, జితేశ్ శర్మలలో ఒకరిని ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం విఫలమవుతున్న ఆటగాళ్లకే అవకాశం ఇచ్చాడు.

పాపం పృథ్వీ షా..

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన పృథ్వీ షాను తీసుకోవాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో ఆడే పృథ్వీ షా టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడని, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడాల కంటే పృథ్వీ షా టీ20 గణంకాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పాడు. పవర్ ప్లే కీలకమైన టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడగలిగే పృథ్వీ షా వంటి ఓపెనర్లు ఉండటం చాలా కీలకమని, అతనిలాంటి ఓపెనర్ లేకనే టీమిండియా వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో విఫలమైందని గుర్తు చేస్తున్నారు. అప్పుడు కేఎల్ రాహుల్ తన జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా పతనానికి కారణమైతే.. ఇప్పుడు అదే శైలిలో ఆడే శుభ్‌మన్ గిల్ జట్టుకు భారమయ్యాడని కామెంట్ చేస్తున్నారు.

గుజరాత్ ఆటగాళ్ల కోసం..

హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ ఆటగాళ్లకు అనవసర ప్రాధాన్యత లభిస్తుందనే ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అసలు టీ20 ప్రణాళికల్లో లేని గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్, శివమ్ మావిలు హార్దిక్ కెప్టెన్సీలో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు.

గుజరాత్‌ రాష్టానికి చెందిన దీపక్ హుడాకు సైతం ప్రాధానత్య ఇస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ అయిన శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టలేకనే హార్దిక్.. పృథ్వీ షాకు అవకాశం ఇవ్వలేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

బిన్నీ గారూ.. హార్దిక్ కెప్టెన్సీ పీకేయండి..

కొంతమంది ఫ్యాన్స్ అయితే హార్దిక్ పాండ్యాపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై వేటు వేయాలని కోరుతున్నారు. కెప్టెన్‌గా పట్టుమని పది మ్యాచ్‌లు కూడా ఆడని హార్దిక్ పాండ్యాకు బలుపు ఎక్కువైందని, ఆటగాళ్లపై కనీస గౌరవం లేదని మండిపడుతున్నారు. తానే మోనార్క్ అన్నట్లు వ్యవహరిస్తున్నాడని, చెత్త నిర్ణయాలతో జట్టు ఓటములకు కారణమవుతున్నాడని మండిపడుతున్నారు.

Story first published: Sunday, January 29, 2023, 19:44 [IST]
Other articles published on Jan 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+