కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు: హార్దిక్ పాండ్యా

వెల్లింగ్టన్: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో నిరాశ పరిచిన టీమిండియా దాని నుంచి బయట పడి తదుపరి టార్గెట్‌పై ఫోకస్ పెట్టింది. వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్లాలని చూస్తోంది. ఈ క్రమంలోనే వెస్టిండీస్, అమెరికా వేదికగా 2024లో జరిగే తదుపరి టోర్నీకి రోడ్ మ్యాప్ స్టార్ట్ అయ్యిందని టీమిండియా తాత్కలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. లక్ష్యం దిశగా ముందుకెళ్లే కొద్దీ చాలా మంది ఆటగాళ్లకు సత్తా నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయని చెప్పాడు.
ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిన టీమిండియా శుక్రవారం మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌తో పోటీపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీ, షమీకి రెస్ట్ ఇవ్వగా.. హార్దిక్ జట్టును నడిపించనున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి బుధవారం ఈ సిరీస్ ట్రోఫీని ఆవిష్కరించిన హార్దిక్ మీడియాతో మాట్లాడాడు.

మేం ప్రొఫెషనల్ ఆటగాళ్లం..
ప్రపంచకప్ వైఫల్యం నుంచి జట్టు బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 'ప్రపంచకప్ ఫలితంతో జట్టులో నిరాశ ఉన్న విషయం తెలుసు. కానీ మేమంతా ప్రొఫెషనల్ ఆటగాళ్లం. విజయాలను ఎలా ఆస్వాదిస్తామో.. వైఫల్యాన్ని అలాగే జీర్ణించుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. వచ్చే ప్రపంచకప్ దాదాపు రెండేళ్ల తర్వాత జరగనుంది. అప్పటిలోపు కొత్త ప్రతిభావంతులను వెలికితీయడానికి మాకు సమయం ఉంది. ఈ లోపు చాలా క్రికెట్ జరుగుతుంది. చాలా మందికి చాలినన్ని అవకాశాలు లభిస్తాయి.

రోడ్ మ్యాప్ షురూ..
వచ్చే ప్రపంచకప్‌కు సంబంధించిన రోడ్ మ్యాప్ ఇప్పుడే మొదలైంది. అయితే మాకు చాలా సమయం ఉంది. ఏం చేయాలన్నదానిపై కూర్చుని మాట్లాడతాం. ఇప్పుడైతే మా లక్ష్యం ఆటను ఆస్వాదించడమే. భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడతాం'' అని హార్దిక్ చెప్పాడు. సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలు అందుకున్న యువ ఆటగాళ్లకు ఈ న్యూజిలాండ్ సిరీస్ చాలా కీలకమని హార్దిక్ తెలిపాడు. 'మా ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా పలువురు టాలెంటెడ్ ప్లేయర్లు బరిలో నిలిచారు. కొత్త శక్తి, ఉత్సాహంతో కూడిన కుర్రాళ్లతో కలిసి ఆడేందుకు నేను సిద్దంగా ఉన్నా.

ప్రతీ సిరీస్ ముఖ్యమైనదే..
నా వరకు ప్రతీ సిరీస్ ముఖ్యమైనది. ఇది ముఖ్యమైనది కాదని ఏ మ్యాచ్ ఆడలేం. వచ్చే ఏడాది ప్రపంచకప్ ఉన్నప్పటికీ అదే వేరే ఫార్మాట్. కానీ ఈ సిరీస్ కుర్రాళ్లకు చాలా ముఖ్యమైనది. ఇక్కడ రాణిస్తే వాళ్లు మరింత ముందుకెళ్లేందుకు తగిన అవకాశం లభిస్తుంది.'అని హార్దిక్ చెప్పుకొచ్చాుడ.
టీ20 ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత టీమిండియా చాలా విమర్శలు వచ్చాయి. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ సాధించింది ఏమీ లేదని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత పేలవ జట్టుగా మారిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శించడంపై హార్దిక్ స్పందించాడు.

నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..
'మేం బాగా ఆడనప్పుడు ప్రజలు వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు. దాన్ని మేం గౌరవిస్తాం. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్నందున మేం ఎవ్వరికీ నిరూపించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది ఒక ఆట మరింత మెరుగవ్వడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఫలితం కావాల్సిన టైంలో వస్తుంది. ఇప్పుడు కొన్ని అంశాలపై ఫోకస్ పెట్టాలి. మా తప్పిదాలను గుర్తించి కచ్చితంగా సరిదిద్దుకుంటాం.'అని హార్దిక్ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని రీతిలో హార్దిక్.. మైఖేల్ వాన్‌కు బదిలిచ్చాడని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications