IND vs NZ: హార్దిక్.. నీకు ఎందుకింత బలుపు? పృథ్వీ షా ఏ పాపం చేశాడు రా?

అహ్మదాబాద్: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. వరుసగా మూడో టీ20లోనూ ఈ విధ్వంసకర ఓపెనర్‌కు అవకాశం దక్కలేదు. రంజీ ట్రోఫీలో విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో 18 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చిన పృథ్వీ షాకు వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశే ఎదురైంది.
వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండగా నిలిచాడు. దాంతో అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీ షా చేసిన పాపం ఏంటో చెప్పమని నిలదీస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పృథ్వీ షాపై అభిమానులు సానుభూతి కనబరుస్తున్నారు.
హార్దిక్..10 మ్యాచ్‌లకే ఇంత బలుపా?
పృథ్వీ షాకు అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర అసహనానికి గురైన అభిమానులు.. హార్దిక్ పాండ్యాపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 10 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగానే హార్దిక్ పొగరు నెత్తికెక్కిందని మండిపడుతున్నారు. జట్టులో తానే గొప్ప ప్లేయర్‌ననే భ్రమలో ఉన్నాడని, ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడని విమర్శిస్తున్నారు.
కెప్టెన్ అయిన తర్వాత హార్దిక్ అటిట్యూడ్ మారిందని.. ఇప్పుడే ఇంత బిల్డప్ ఇస్తే.. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటాడోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అనే శుభ్‌మన్ గిల్‌కు వరుసగా అవకాశాలు ఇస్తున్నాడని, టీ20ల్లో అతను తడబడుతున్నా అండగా నిలవడం సరికాదని విమర్శిస్తున్నారు.
సీనియర్లు చెబ్తున్నా..
టీ20 ఫార్మాట్‌లో పృథ్వీ షాకు వరుసగా అవకాశాలు ఇవ్వాలని, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో ఆడే అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలని గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్ చాలా కాలం నుంచి చెబుతున్నా.. టీమ్‌మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదు. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడాల కంటే పృథ్వీ షా టీ20 గణంకాలు మెరుగ్గా ఉన్నాయని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
పవర్ ప్లే కీలకమైన టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడగలిగే పృథ్వీ షా వంటి ఓపెనర్లు ఉండటం చాలా కీలకమని, అతనిలాంటి ఓపెనర్ లేకనే టీమిండియా వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో విఫలమైందని గుర్తు చేస్తున్నారు. అప్పుడు కేఎల్ రాహుల్ తన జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా పతనానికి కారణమైతే.. ఇప్పుడు అదే శైలిలో ఆడే శుభ్‌మన్ గిల్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వడం ఏంటో తమకు అర్థం కావడం లేదన్నాడు.
ఇషాన్, శుభ్‌మన్ విఫలమవుతున్నా..
ఇషాన్ కిషన్ వరుసగా 13 టీ20 ఇన్నింగ్స్‌ల్లో విఫలమవుతున్నా.. అవకాశం ఇవ్వడం ఏంటో తమకు అర్థం కావడం లేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీ20 ఫార్మాట్‌కు ఏ మాత్రం సూటవ్వని శుభ్‌మన్‌ను నెత్తిన పెట్టుకోవడం వెనుక ఉన్న లాజిక్ ఏంటో హార్దిక్ పాండ్యానే చెప్పాలని విమర్శిస్తున్నారు.
హార్దిక్ పాండ్యా.. ఉద్దేశపూర్వకంగానే పృథ్వీ షా కెరీర్‌ను నాశనం చేస్తున్నాడని, అండర్ 19 కెప్టెన్‌గా సక్సెస్ అయిన షా జట్టులోకి వస్తే తన కెప్టెన్సీకి ఎసరు వస్తుందని ఇలా చేస్తున్నాడని ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. వీలైనంత త్వరగా హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించాలని కోరుతున్నారు.
సాయి బాబా చూస్తున్నావా..?
సాయిబాబాను ఆరాధించే పృథ్వీ షాకు త్వరలోనే అవకాశాలు లభిస్తాయని ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ఐపీఎల్ ఒక్కటే షా ముందున్న అవకాశమని, అప్పుడు హార్దిక్‌పై ఉన్న కసిని బంతిపై చూపించాలని కోరుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫు.. గుజరాత్ టైటాన్స్‌పై ఓ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన సత్తా ఏంటో హార్దిక్‌కు చూపించాలని, ముఖ్యంగా అతని బౌలింగ్‌లో గతంలో మాదిరి వరుసగా 6 బౌండరీలు బాదాలని ఆకాంక్షిస్తున్నారు. ఐపీఎల్‌లో చెలరేగితే.. పృథ్వీ షాకు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications