For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: ఓరెయ్ ఫిలిప్స్.. నువ్వు క్రికెటర్‌వా? జిమ్నాస్టిక్ ప్లేయర్‌వా? (వీడియో)

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ మరోసారి స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్లో ఫిలిప్స్ కవర్స్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. అతని సూపర్‌మ్యాన్ క్యాచ్‌కు శుభ్‌మన్ గిల్(31) నిరాశగా పెవిలియన్ చేరాడు.

మిచెల్ సాంట్నర్ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని శుభ్‌మన్ గిల్ కవర్స్ దిశగా ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గ్లేన్ ఫిలిప్స్ కుడివైపు డైవ్ చేసి గాల్లోనే అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ బిత్తరపోయాడు. తొలి వికెట్‌కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

IND vs NZ Glenn Phillips takes another blinder to dismiss Shubman Gill in Champions Trophy 2025 Final

ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఓరెయ్ ఫిలిప్స్.. నువ్వు క్రికెటర్‌వా? జిమ్నాస్టిక్ ప్లేయర్‌వా? అని కామెంట్ చేస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటికే ఫిలిప్స్.. ఈ తరహా క్యాచ్‌లను రెండు అందుకున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ లెగ్‌లో లెఫ్ట్ సైడ్ డైవ్ చేసి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ క్యాచ్‌ను ఇలానే కుడివైపు దూకి సింగిల్ హ్యాండ్‌‌తో అందుకున్నాడు. అతను అందుకున్న ఈ మూడు క్యాచ్‌లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనై హైలైట్‌గా నిలిచాయి.

గ్లేన్ ఫిలిప్స్ క్యాచ్ కారణంగా నిలకడగా ఆడుతున్న టీమిండియా ఒక్కసారిగా ఒత్తిడిలోకి కూరుకుపోయింది. విరాట్ కోహ్లీ(1)ని బ్రేస్‌వెల్ ఔట్ చేయగా.. సెంచరీ దిశగా సాగిన రోహిత్ శర్మను రచిన్ రవీంద్ర పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా 17 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 37), గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా... మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, March 9, 2025, 20:37 [IST]
Other articles published on Mar 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+