For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: 400 అన్నాడు.. 46కే ఆలౌటైన టీమిండియా! గంభీర్‌పై పేలుతున్న సెటైర్స్!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌటవ్వడంపై మండిపడుతున్నారు. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

స్వింగ్ కండిషన్స్‌లో న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 2 ఫోర్లతో 20), యశస్వి జైస్వాల్(63 బంతుల్లో ఫోర్‌తో 13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.

IND vs NZ Gautam Gambhir Brutally Trolled After India All Out For 46 in 1st Test Against New Zealand

న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/15), విలియమ్ ఓ రౌర్కే(4/22), టీమ్ సౌథీ(1/8) భారత్ పతనాన్ని శాసించారు. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. దాంతో గంభీర్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అతన్ని జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారు.

ఈ సిరీస్ ప్రారంభానికి ముందు గంభీర్.. టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్‌ను వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ఒకే రోజులో 400 పరుగులు చేయడంతో పాటు అవసరమైతే రెండు రోజులు బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేసేలా తీర్చిదిద్దాలనుకుంటున్నామని చెప్పాడు. పరిస్థితులకు అందిపుచ్చుకునేలా తయారు చేయాలనుకుంటున్నామని తెలిపాడు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. 400 పరుగులేమో కానీ 46 రన్స్‌కే ఆలౌటయ్యారని విమర్శలు గుప్పిస్తున్నారు.

గౌతమ్ గంభీర్.. బెంగళూరు ప్రేక్షకుల నోళ్లను మరోసారి మూయించాడని, ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను గుర్తు చేస్తున్నారు. బెంగళూరు బేస్డ్ ఫ్రాంచైజీ ఆర్‌సీబీ 49 పరుగులకు ఆలౌటైన రికార్డ్‌ను గంభీర్ పర్యవేక్షణలోని టీమిండియా అధిగమించిందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన తర్వాత భారత ఆటగాళ్ల పనిచెబుతాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట వర్షార్పణమైంది. భారీ వర్షం కారణంగా టాస్ కూడా సాధ్యం కాలేదు. దాంతో రెండో రోజు .. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ అనూహ్యంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడం.. వికెట్‌పై కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ వచ్చి స్వింగ్‌కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్ చేరారు.

Story first published: Thursday, October 17, 2024, 15:10 [IST]
Other articles published on Oct 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+