Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021 డ్రా అయితే పరిస్థితి ఏంటి?.. రిజర్వ్‌ డేను ఎలా నిర్ణయిస్తారు!!

What Will Happen If WTC Final Draw: Will India Be Declared As Winner?
WTC Final Day 4: WTC డ్రా అవుతుందా ? ఫలితం వస్తుందనుకుంటేనే Reserve Day || Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) అంటే.. సాంప్రదాయ క్రికెట్‌లో అగ్రస్థానం ఎవరిదో నిర్ణయించే టోర్నీ. రెండేళ్ల కాల పరిమితితో ఛాంపియన్‌షిను ఐసీసీ ప్రవేశపెట్టింది. 2019లో మొదలైన ఈ డబ్ల్యూటీసీ.. మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. ఈ రెండేళ్లలో విజయాల శాతం ఆధారంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ఈ నెల 18 నుంచి ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్‌ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసింది. అయితే ప్రస్తుతం సౌథాంప్టన్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ ఫలితం తేలేలా కనిపించడం లేదు. డ్రా అయితే పరిస్థితి ఏంటనేది ఓసారి చూద్దాం.

 నాలుగో రోజు ఆట అసాధ్యమే

నాలుగో రోజు ఆట అసాధ్యమే

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజును తుడిచి పెట్టేసిన వరుణ దేవుడు.. రెండు, మూడు రోజుల్లో కాస్త కనికరించాడు. ఈ రెండు రోజల్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగియగా.. కివీస్ ఇంకా ఆడుతోంది. అయితే తొలి రోజు మాదిరే నాలుగో రోజును కూడా వరుణుడు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో భారీ వర్షం కురుస్తోంది.

మూడోరోజు శాంతించినట్టే కనిపించినప్పటికీ.. వరుణుడు తన ప్రతాపాన్ని మళ్లీ ప్రారంభించాడు. మరి కొన్ని గంటల పాటు ఇదే తరహా వాతావరణం నెలకొని ఉంటుందని బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నాలుగో రోజు ఆట కొనసాగడం అనుమానంగానే మారింది. మ్యాచుకు ముందు వరణుడు కరుణిస్తే గాని ఆట మొదలయ్యే అవకాశం ఉండేదు.

రిజర్వ్​ డే ఉంటుందా లేదా

రిజర్వ్​ డే ఉంటుందా లేదా

నాలుగో రోజైన సోమవారం కూడా వరణుడు వస్తే.. దాదాపు ఆట అసాధ్యం. ఒకవేళ ఒకటీ, రెండు సెషన్ల పాటు ఆట సాగినా.. కివీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన రోజులో దాదాపు ఫలితం రావడం అసాధ్యమే. జూన్ ​23వ తేదీని రిజర్వ్​ డేగా ఐసీసీ షెడ్యూల్​లో పేర్కొంది. అయితే అవసరమైతేనే ఆరో రోజు ఆట ఆడిస్తామని స్పష్టంగా చెప్పింది. 30 గంటల ఆటను ఐదు రోజుల్లో పూర్తి చేయలేని పక్షంలోనే.. రిజర్వ్​ డే ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. రిజర్వ్​ డేలో ఆట ఉంటుందా లేదా అనే అంశంపై మ్యాచ్​ రిఫరీ తుది నిర్ణయం తీసుకుంటారు. ఫలితం వస్తుందనుకుంటేనే రిజర్వ్​ డేని ఉపయోగిస్తారు.

IND vs NZ Day 4 Weather Report: కోహ్లీసేనపై వరుణుడి కరుణ..వాష్ అవుట్‌కే ఛాన్స్..మళ్లీ ఎల్లో వార్నింగ్

మ్యాచ్ డ్రా అయితే

మ్యాచ్ డ్రా అయితే

ఐదు రోజుల (రిజర్వ్​ డే) మ్యాచ్‌లో విజేత ఎవరో తేలితే ఏ ఇబ్బందీ లేదు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే మాత్రం భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో పరిస్థితి చూస్తే.. ఇదే జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు 1.6 మిలియన్ డాలర్ల బహుమతిని ఐసీసీ ఇవ్వనుంది. రన్నరప్‌కు 0.8 మిలియన్ డాలర్లు (రూ. 5 కోట్ల 85 లక్షల 88 వేలు) అందనున్నాయి. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే.. బహుమతి డబ్బును ఇద్దరు ఫైనలిస్టులు (భారత్, న్యూజిలాండ్‌) పంచుకోనున్నారు.

న్యూజిలాండ్‌దే పైచేయి

న్యూజిలాండ్‌దే పైచేయి

భారత్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. మూడో రోజు బంతి, బ్యాట్‌తో టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 101 రన్స్ చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను అరగంట ముందుగానే నిలిపివేశారు.

ఓపెనర్లు టామ్‌ లాథమ్ ‌(30; 104 బంతుల్లో 3x4), డెవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో 6x4) క్రీజులో ఉన్నారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు భారత్‌ 146/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించగా.. మరో 71 పరుగులు (217) చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (49; 117 బంతుల్లో 5x4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44; 132 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

Story first published: Monday, June 21, 2021, 11:22 [IST]
Other articles published on Jun 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+