Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఓయ్ రోహిత్.. బుద్దుందా? ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వరా? ఫ్యాన్స్ ఫైర్!

 IND vs NZ: Fans slams Rohit Sharma After Umran Malik misses out in Hyderabad ODI vs New Zealand

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా సేన్సేషన్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం దక్కలేదు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్‌ను విశ్రాంతి పేరుతో ఆఖరి మ్యాచ్‌కు దూరం పెట్టారు. అయితే న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఉమ్రాన్ రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం ఉమ్రాన్ మాలిక్ బదులు పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్‌ను పక్కనపెట్టి.. స్లోయర్ బౌలర్‌ను తీసుకోవం ఏందని ప్రశ్నిస్తున్నారు.

ఆ దేవుడే కాపాడాలి..

వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియా.. ఉమ్రాన్ మాలిక్‌కు ప్రతీ మ్యాచ్ అవకాశం ఇచ్చి.. రాటేదేల్చాలని సూచిస్తున్నారు. అతనిలాంటి ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ ముందు వరకు మనకు లేరని, జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్ చేస్తున్నారు. శ్రీలంకతో అద్భుత ప్రదర్శన కనబర్చి సూపర్ ఫామ్‌లో ఉన్న ఉమ్రాన్ మాలిక్‌ను పక్కనపెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. బ్యాటింగ్ డెప్త్ కోసం ప్రధాన బౌలర్‌ను పక్కనపెట్టడం ఏంటో తమకు అర్థం కావడం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇదే తరహా మైండ్‌సెట్‌తో క్వాలిటీ ప్లేయర్లను జట్టుకు దూరం పెడితే టీమిండియా ప్రపంచకప్ గెలవడం దేవుడెరుగు.. కనీసం నాకౌట్ దశ కూడా ధాటదని హెచ్చరిస్తున్నారు.

బ్యాటింగ్ డెప్త్ కోసం..

ఉమ్రాన్ మాలిక్ గత మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసాడని, అంతకుమించి గంటకు 157 కిలోమీటర్ల వేగంతో ఫాస్టెస్ట్ డెలవరీ వేసాడని గుర్తు చేస్తున్నారు. కత్తిలాంటి బౌలర్‌ను బ్యాటింగ్ డెప్త్ కోసం పక్కనపెట్టడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. పైగా టాపార్డర్ బ్యాటర్లు అంతా జోరు మీదున్న క్రమంలో ఇలాంటి ప్రయోగాలు అనవసరమని మండిపడుతున్నారు. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ కూడా ఉమ్రాన్ మాలిక్ గైర్హాజరీ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. శార్దూల్ ఠాకూర్ కోసం ఉమ్రాన్ మాలిక్‌ను పక్కనపెట్టడం బుద్ది తక్కువ నిర్ణయమని మాజీ క్రికెటర్లు కూడా విమర్శిస్తున్నారు.

శార్దూల్‌ను నమ్ముకుంటే నష్టమే..

బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దూల్ ఠాకూర్‌ను నమ్ముకుంటే టీ20 ప్రపంచకప్ 2021 వైఫల్యం రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. శార్దూల్‌పై నమ్మకం ఉంచలేని పరిస్థితని, అతనికి మ్యాచ్‌లు గెలిపించే సత్తా లేదని కామెంట్ చేస్తున్నారు. ఆల్‌రౌండ్ ఆప్షన్ కోసం శార్దూల్‌కు అవకాశాలు ఇస్తే మొదటికే మోసం వస్తుందని, జట్టులో ఉన్నఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడు సరిపోతాడని అభిప్రాయపడుతున్నారు. తన ఐపీఎల్ టీమ్ హోమ్ గ్రౌండ్ అయిన హైదరాబాద్‌లో ఉమ్రాన్ మాలిక్‌‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మండిపడుతున్నారు.

భారత్‌దే బ్యాటింగ్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంక‌తో సిరీస్‌లో చేసినట్లే అండర్ లైట్స్‌లో బౌలింగ్ చేసి, లక్ష్యాన్ని కాపాడుకోవడానికే తాము ప్రయత్నిస్తామని చెప్పాడు. పిచ్ బాగుందని, కొంత డ్రైగా ఉందని రోహిత్ చెప్పాడు. 'లైట్స్‌లో బౌలింగ్ చేస్తూ కూడా స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. శ్రీలంకపై కూడా ఇలాగే చేశాం. జట్టులో అందరూ నూటికి నూరు శాతం ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నారు' అని అన్నాడు. ఈ సిరీస్‌లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇద్దరూ ఆడటం లేదనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ల స్థానంలో ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్ స్పష్టం చేశాడు.

Story first published: Wednesday, January 18, 2023, 14:29 [IST]
Other articles published on Jan 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+