Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదు మ్యాచ్‌లకే ఇంత బలుపా.. హార్దిక్ పాండ్యా వైఖరిపై ఫ్యాన్స్ ఫైర్!

IND vs NZ: Fans slam Hardik Pandya for his arrogance attitude

హైదరాబాద్: టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ అయిన తర్వతా హార్దిక్ పాండ్యాకు తల పొగరు ఎక్కువైందని మండిపడుతున్నారు. ఐదు మ్యాచ్‌లకే ఇంత అటిట్యూడ్ చూపిస్తే.. చాలా కష్టమని, టీమిండియా సారథిగా కొనసాగాలంటే ఒదిగి ఉండటం ముఖ్యమని హితవు పలుకుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2022 వైఫల్యం అనంతరం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లగా.. మూడు టీ20ల సిరీస్‌కు హార్దిక్ సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌ను 1-0తో గెలిచిన హార్దిక్.. మూడో టీ20 అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు.

నా జట్టు నా ఇష్టమంటూ..

సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టు అవకాశం ఇవ్వకపోవడంపై నెటిజన్లు ప్రశ్నలు సంధించగా.. ఇది నా జట్టు నా ఇష్టమని సమాధానమిచ్చాడు. బయటి వ్యక్తుల మాటలు తమను ప్రభావం చేయలేవని, కోచ్‌తో మాట్లాడిన తర్వాతే అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకుంటానని చెప్పాడు.

చిన్న సిరీస్ కావడంతో అందరికి అవకాశాలు ఇవ్వలేపోయామని, మరిన్నీ మ్యాచ్‌లు ఉంటే ప్రయోగాలు చేసేవాళ్లమని చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలు కొంతమంది అభిమానులకు నచ్చడం లేదు. పూర్తి స్థాయి కెప్టెన్ కాకముందే హార్దిక్ పాండ్యా.. ఇంత అహంకారపూరితంగా మాట్లాడుతుంటే.. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటాడోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముంబై అందుకే వదిలేసింది..

పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాక ముందే.. నా జట్టు అంటూ హార్దిక్ వ్యాఖ్యానించడం బాలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ అటిట్యూడ్ కారణంగానే ముంబై ఇండియన్స్ అతన్ని వదిలేసిందని, ఈ తరహా ప్రవర్తన అతనితో పాటు జట్టుకు మంచిది కాదని సూచిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కూడా హార్దిక్ ఇలానే ప్రవర్తించాడని, మైదానంలో సీనియర్ ఆటగాళ్లనే గౌరవం లేకుండా నోరు పారేసుకున్నాడని గుర్తు చేస్తున్నారు. టీమిండియా టీ20 సారథిగా ఎంపికైతే ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుందని కామెంట్ చేస్తున్నారు.

ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు..

కెప్టెన్ అయిన తర్వాత హార్దిక్ అటిట్యూడ్ మారిందని, రెండు మ్యాచ్‌ల్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఐదు మ్యాచ్‌లకే ఇంత బిల్డప్ ఇస్తే.. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటాడోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం హార్దిక్ పాండ్యా మాట్లాడిన దాంట్లో తప్పు ఏం ఉందని మద్దతుగా నిలుస్తున్నారు. బయటి విమర్శలను పట్టించుకోమనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పాడని, దాన్ని అందరూ అపార్దం చేసుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు.

ఏకైక కెప్టెన్‌గా..

టీ20 ఫార్మాట్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓటమే ఎరుగని భారత కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. న్యూజిలాండ్ పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న హార్దిక్.. చివరి టీ20 మ్యాచ్ టై అవ్వడంతో ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ ఏడాదే ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తాత్కలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో గెలిచాడు. ఇక వెస్టిండీస్ పర్యటనలో ఓ మ్యాచ్‌కు సారథ్యం వహించిన హార్దిక్ 88 పరుగులతో జట్టుకు విజయాన్నందించాడు. తాజా పర్యటనలో రెండో టీ20ని 65 పరుగులతో గెలిచిన టీమిండియా.. చివరి మ్యాచ్ వర్షం కారణంగా టై చేసుకుంది. దాంతో ఓటమే ఎరుగని కెప్టెన్‌గా హార్దిక్ దూసుకెళ్తున్నాడు.

Story first published: Wednesday, November 23, 2022, 15:24 [IST]
Other articles published on Nov 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+