Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: టీమిండియా కొంపముంచిన చెత్త ఫీల్డింగ్.. ఏది కలిసి రావడం లేదు!

IND vs NZ: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఏది కలిసిరావడం లేదు. ఈ మ్యాచ్‌కు ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమవ్వడంతో టీమిండియా ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగింది.

అసలే ఓ బౌలర్ తక్కువగా ఉన్నాడనుకుంటే.. టీమిండియా ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్ న్యూజిలాండ్ బ్యాటర్లకు కలిసొస్తోంది. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అయిన రవీంద్ర జడేజా సునాయస క్యాచ్ వదిలేస్తే.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరో క్యాచ్ నేలపాలు చేశాడు. బౌండరీ లైన్ వద్ద జస్‌ప్రీత్ బుమ్రా మరో ఈజీ క్యాచ్‌ను వదిలేసాడు. ఈ మూడు అవకాశాలతో న్యూజిలాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు.

IND vs NZ: Fans In Disbelief After Jasprit Bumrah Drops Daryl Mitchell; Three Catches Dropped In Total

ముఖ్యంగా ఫీల్డ్‌లో సింహంలా కదిలే జడేజా.. లడ్డూ లాంటి క్యాచ్ వదిలేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఫీల్డింగ్‌లో అత్యంత తక్కువగా తప్పిదాలు చేసే జడేజా.. మూడేళ్ల తర్వాత క్యాచ్ వదిలేసాడు. చివరిసారిగా 2020లో జడేజా ఓ క్యాచ్ నేలపాలు చేశాడు. అతని తప్పిదంతో రచిన్ రవీంద్ర బచాయించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వచ్చిన ఈ అవకాశంతో చెలరేగిన అతను 75 పరుగులు చేశాడు. మూడో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

డారిల్ మిచెల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుకోలేకపోయాడు. 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతనికి తొలి లైఫ్ లభించగా.. 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మరో అవకాశం లభించింది.

కుల్దీప్ యాదవ్ వేసిన 33 ఓవర్ ఐదో బంతిని డారిల్ మిచెల్ భారీ షాట్ ఆడగా.. లాంగాఫ్‌లో బుమ్రాకు సునాయస క్యాచ్ వచ్చింది. కానీ అతను క్యాచ్ వదిలేయడంతో పాటు బంతిని బౌండరీలోకి నెట్టేసాడు.

క్యాచ్‌లే కాకుండా పరుగులను నియంత్రించడంలోనూ భారత ఫీల్డర్లు తడబడ్డారు. ఆపాల్సిన బౌండరీలను కూడా వదిలేసారు. ఎల్బీడబ్ల్యూల విషయంలోనూ భారత్‌కు కలిసి రాలేదు. రెండు సార్లు న్యూజిలాండ్ ఆటగాళ్లు రివ్యూ తీసుకొని ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

19 పరుగులకే 2 వికెట్లు తీసి మంచి శుభరాంభం అందుకున్న టీమిండియా చెత్త ఫీల్డింగ్‌తో మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. భారత చెత్త ఫీల్డింగ్‌తో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న కివీస్ బ్యాటర్లు జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.

Story first published: Sunday, October 22, 2023, 17:02 [IST]
Other articles published on Oct 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+