Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: చరిత్ర సృష్టించిన హాట్‌స్టార్.. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డు!

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ : CWC 2023: డిజిటల్ ఫ్లాట్ ఫామ్ డిస్నీహాట్ స్టార్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీకి డిజిటల్ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న హాట్ స్టార్ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదు చేసింది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో రికార్డు రియల్ టైమ్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఆద్యంతం ఉత్కంఠగా సాగినా ఈ మ్యాచ్‌లో గరిష్టంగా 4 కోట్ల 30 లక్షల రియల్ టైమ్ వ్యూస్ నమోదయ్యాయి. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో హాట్‌స్టార్ వ్యూయర్స్ సంఖ్య 4 కోట్లు ధాటింది. క్రమంగా 4.3 కోట్లకు చేరింది. దురదృష్టవశాత్తు విరాట్ కోహ్లీ 95 పరుగుల వద్ద ఔటై.. సెంచరీ చేజార్చుకోగా టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

 IND vs NZ: Disney Hotstar creates new viewership record during Virat Kohli’s batting

ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ వ్యూస్ 3.5 కోట్లకు తగ్గలేదు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గరిష్టంగా 3.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా మ్యాచ్ బద్దలు కొట్టింది. ఆదివారం మ్యాచ్ కావడం.. దసరా పండుగ సెలవులు రావడం.. గత 20 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై విజయం లేకపోవడంతో జనాలు అంతా మ్యాచ్‌పై ఆసక్తి కనబర్చారు.

దాంతో డిస్నీ హాట్ స్టార్ పంట పండింది. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డు నమోదు అయ్యింది. క్రికెట్‌లోనే కాకుండా ఇతర క్రీడల్లో కూడా ఓ మ్యాచ్‌కు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇన్ని రియల్ టైమ్ వ్యూస్ రావడం ఇదే తొలిసారి.

ప్రపంచకప్ ముందు శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్ 2023లో‌నూ భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గరిష్టంగా 2 కోట్ల 80 లక్షల రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. మెగా టోర్నీ ముందు వరకు ఇదే హయ్యెస్ట్ రికార్డుగా ఉండేది. 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా గరిష్టంగా 2 కోట్ల 53 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది కూడా హాట్ స్టార్ రికార్డే.

ఈ సారి సబ్‌స్క్రిప్షన్ లేకుండా డిస్నీ హాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పించడంతో ఈ రికార్డు వ్యూస్ నమోదు అయ్యాయి. ఐపీఎల్ రైట్స్ దక్కించుకున్న జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్‌ మ్యాచ్‌లను సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే ఆస్కారం కల్పించింది.

మెగా టోర్నీ భారత్ ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో తాజా రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగలేదు. అన్ని మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగిసాయి. ప్రధాన జట్ల మధ్య టఫ్ మ్యాచ్ జరిగితే వ్యూస్ 4 కోట్లు దాటే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.

Story first published: Monday, October 23, 2023, 15:28 [IST]
Other articles published on Oct 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+