మ్యాచ్‌ను మలుపుతిప్పి..
తన ఫస్ట్ ఓవర్‌లోనే మార్క్‌చాప్‌మన్(12)ను ఔట్ చేసిన సిరాజ్.. తన మూడో ఓవర్‌లో డేంజరస్ గ్లేన్ ఫిలిప్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54)ను పెవిలియన్ చేర్చాడు. తన చివరి ఓవర్‌లో జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్‌లను పెవిలియన్ చేర్చాడు. 130/2 స్కోర్‌తో పటిష్టంగా కనిపించిన కివీస్ ఓ దశలో 190+ పరుగులు చేస్తుందేమో అనిపించింది.
కానీ సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. డాట్ బాల్స్‌తో ఫిలిప్స్‌ను ఒత్తిడికి గురి చేసి ఫిలిప్స్‌ను బుట్టలో వేసుకున్నాడు. ఈ వికెట్‌తో మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. చివరి 4.2 ఓవర్లలో 30 పరుగులు చేసిన కివీస్.. 8 వికెట్లు కోల్పోయింది.
హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా..
ఇక రెండో టీ20లో రెండు వికెట్లు తీసిన సిరాజ్.. ఓ ఓవర్ మెయిడిన్ కూడా చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ స్టార్ 6.83 యావరేజ్.. 5.12 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ స్ట్రైక్ రైట్ 8గా ఉండటం విశేషం. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. బెస్ట్ యావరేజ్, ఎకానమీ, స్ట్రైక్‌రైట్ కలిగిన బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా కివీస్‌పై రెండో అత్యత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడు. సిరాజ్ నుంచి ఇలాంటి ప్రదర్శన రావడాన్ని నెటిజన్లు నమ్మలేకపోతున్నారు.
ప్రపంచకప్ ఆడించి ఉంటే..
టెస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరాజ్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అంతగా రాణించింది లేదు. ధారళంగా పరుగులిస్తూ బౌలింగ్ చేసేవాడు. ఆ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతనిపై చిన్నచూపు ఉండేది. ఇక ప్రపంచకప్ ముందు బుమ్రా గాయపడటంతో రేసులోకి వచ్చిన సిరాజ్.. షమీ ఫిట్ అవ్వడంతో అవకాశాన్ని అందుకోలేకపోయాడు. స్టాండ్‌బై ప్లేయర్‌గా ఆసీస్ వెళ్లినా.. ఒక్క మ్యాచ్ ఆడలేకపోయాడు. సిరాజ్ తాజా ప్రదర్శన చూసిన తర్వాత అతన్ని ప్రపంచకప్ ఆడిస్తే బాగుండేదేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేకంగా సన్నదమవ్వడం..
పైగా ఆసీస్ స్వింగ్, పేస్ కండిషన్స్ సిరాజ్‌కు సరిగ్గా సరిపోయేవని, తన అరంగేట్ర టెస్ట్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించాడని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ప్రపంచకప్ కోసం తాను ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యానని, అది ఈ సిరీస్‌లో ఉపయోగపడిందని ఇన్నింగ్స్ అనంతరం సిరాజ్ తెలిపాడు. ముఖ్యంగా హార్ద్ లెంగ్త్స్ వేయడం నేర్చుకున్నానని చెప్పాడు. ప్రణాళికలకు తగ్గట్లు హార్డ్ లెంగ్త్స్ వేసి ఫలితం రాబట్టానని చెప్పాడు. ఇక సిరాజ్‌ను ప్రపంచకప్‌లో ఆడించి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications












