IND vs NZ: దీపక్ హుడా.. క్వాలిటీ బౌలింగ్ ఆడలేడు! జట్టుకు మరో శంకరన్నలా మోపైండు.. ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో బౌలింగ్‌తో పర్వాలేదనిపించిన విజయ్ శంకర్.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫమయ్యాడు. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం సంజూ శాంసన్‌ను కాదని దీపక్ హుడాకు టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వగా.. అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ముఖ్యంగా మూడో వన్డేలో అతను ఔటైన తీరు అభిమానులకు తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. టీమిండియా ఒత్తిడిలో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు దిగిన హుడా.. 25 బంతుల్లో 12 రన్స్ మాత్రమే చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరో విజయ్ శంకర్‌లా..?
హుడా క్యాచ్ ఇచ్చినప్పటికీ.. అటు బౌలర్‌గానీ.. ఇటు వికెట్ కీపర్‌గానీ అప్పీల్ చేయలేదు. కానీ కెప్టెన్ విలియమ్సన్ రివ్యూ కోరడంతో.. రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడినట్లు తేలింది. దీంతో హుడా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆల్‌రౌండర్ అనే కారణంతో.. ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా దీపక్ హుడాను జట్టులోకి తీసుకోగా... బ్యాటింగ్‌లో అతడు విఫలం కావడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. దీంతో జట్టులో మరో విజయ్ శంకర్ తయారు అవుతున్నాడంటూ హుడాను ఉద్దేశించి నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు.
క్వాలిటీ బౌలింగ్ ఆడలేడు..
'బ్యాటింగ్ చేయలేడు, బౌలింగ్ చేయలేడు. మంచి ఆటగాళ్లకు అవకాశం రాకుండా అడ్డుకుంటున్నాడు. బంతి ఒక అంగుళం మూవ్ అయినా బ్యాటింగ్ చేయలేడు. కాసేపు కివీస్ ఆల్‌రౌండర్ డారీ మిచెల్ కాస్త ప్రమాదకర బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌లా కనిపించాడు.'అని హుడా బ్యాటింగ్‌ను ఉద్దేశించి సెటైర్లు పేల్చుతున్నారు. 'దీపక్ హుడా విషయంలో కఠినంగా ఉందామని కాదు గానీ.. ఇప్పటి వరకూ నాణ్యమైన అంతర్జాతీయ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కోవడంలో అతను చాలా యావరేజ్ ఆటగాడిలా కనిపించాడు. ఫాస్ట్ మీడియం బౌలర్లను ఎదుర్కోవడంలో ఎప్పుడూ తొందరపాటుగా.. ఇబ్బందికరంగా కనిపిస్తాడు'అని ఓ నెటిజన్ అతని లోపాన్ని బయటపెట్టాడు.
టెక్నిక్ మార్చుకోవాలి..
వన్డేల కోసం దీపక్ హుడా తన టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. టీ20ల్లో మేనేజ్ చేసినట్లు వన్డేల్లో చేయడం కుదరదన్నాడు. 'వన్డేల్లో హుడా 4వ స్థానంలోపే బ్యాటింగ్ చేయగలడు. టీ20ల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడగలడు. కానీ హై క్వాలిటీ పేసర్లను ఎదుర్కొంటూ అతన్ని ఫినిషర్‌గా ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. బౌలింగ్ చేయగలడు కాబట్టే అతడు జట్టులో ఉన్నాడు' అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
వర్షంతో రద్దు..
వర్షంతో రద్దయిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్(64 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టు పరువును కాపాడగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సూర్య, అయ్యర్, దీపక్ హుడాలు కూడా జట్టుకు అండగా నిలవలేకపోయారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ మూడేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సరికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications