న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అనూహ్యంగా 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో టీమిండియా వెనుకంజలో నిలిచింది. ఇరు జట్ల మధ్య పుణె వేదికగా గురువారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
తొలి పరాజయం నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్, తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ప్రదర్శన చర్చనీయాంశమైంది. బెంగళూరు టెస్ట్‌లో రెండు వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా.. వికెట్లను మాత్రం సాధించలేకపోయాడు. దాంతో జస్‌ప్రీత్ బుమ్రాపై అనవసర ఒత్తిడి నెలకొంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

13 మ్యాచ్‌లు 19 వికెట్లే..
సొంతగడ్డపై ఇప్పటి వరకు 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 36.15 యావరేజ్‌తో 19 వికెట్లు మాత్రమే తీసాడు. ఈ గణంకాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు టెస్ట్‌కు సూపర్ ఫామ్‌లో ఉన్న యువపేసర్ ఆకాశ్‌దీప్‌ను కాదని మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయడం జట్టుకు నష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలోనే అతనికి ప్రత్యామ్నాయ బౌలర్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. కొత్త బంతితో సిరాజ్ వికెట్లు తీయలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సబా కరీమ్.. రెండో టెస్ట్‌లో సిరాజ్‌ను తప్పించి ఆకాశ్‌దీప్‌ను తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

ఆకాశ్‌దీప్ సరైనోడు..
'మహమ్మద్ సిరాజ్ కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. రెండో టెస్ట్‌కు అతన్ని తుది జట్టులోకి తీసుకునే విషయంపై టీమిండియా మేనేజ్‌మెంట్ కచ్చితంగా చర్చలు జరుపుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్రంట్‌లైన్ పేస్ బౌలర్ కొత్త బంతితో వికెట్ తీయాలి. మళ్లీ రెండో కొత్త బంతితోనూ అదే ప్రదర్శనను రిపీట్ చేయాలి. కానీ సిరాజ్ అలా చేయలేకపోతున్నాడు.
కొత్త బంతితో వికెట్లు తీసే విషయంలో అతను తడబడుతున్నాడు. ఆకాశ్‌దీప్ మాత్రం ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నాడు. అంతేకాకుండా భారత పిచ్‌లపై బౌలింగ్ చేసిన అనుభవం ఆకాశ్‌దీప్‌కు ఎక్కువగా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున చాలా ఏళ్లుగా ఆడుతున్నాడు. కాబట్టి నిర్జీవమైన పిచ్‌లపై ఏ జట్టు అయినా అనుభవం కలిగిన ఆటగాళ్లనే ఆడిస్తాయి.'అని సబా కరీం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో చెప్పుకొచ్చాడు.
మూడు మార్పులతో టీమిండియా..
పుణే టెస్ట్‌కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. మోకాలి గాయానికి గురైన రిషభ్ పంత్‌కు రెస్ట్ ఇవ్వనుంది. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్‌తో వికెట్ కీపింగ్ చేయించి.. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్‌గా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవచ్చు. శుభ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకుంటే మాత్రం రాహుల్‌పై వేటు పడనుంది.
సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్‌ను తుది జట్టులో నుంచి తప్పించలేని పరిస్థితి. సిరాజ్ స్థానంలో ఆకాశ్ దీప్ ఆడే ఛాన్స్ ఉంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించవచ్చు.
తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్/ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా.