IND vs NZ: 107 స్కోర్‌తో టీమిండియా గెలిచేనా? గత రికార్డులు ఏంటంటే..?
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్(195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 150), రిషభ్ పంత్(105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 99) రాణించారు.
అయితే 356 పరుగుల లోటుతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగడంతో న్యూజిలాండ్ ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. అయితే స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకుంటుందా? లేక కివీస్ చేధిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్‌కు ఈ లక్ష్యాన్ని చేధించడం ఏ మాత్రం కష్టం కాదు. కానీ టెస్ట్ ఫార్మాట్‌లో చివరి రోజు లక్ష్యాన్ని చేధించడం ఏ జట్టుకైనా కష్టం. ఎందుకంటే పిచ్‌పై పగుళ్లు ఏర్పడి వికెట్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. అనూహ్య బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలోనే 107 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
గతంలో టీమిండియా స్వల్ప లక్ష్యాలను కాపాడుకొని సంచలన విజయాలు నమోదు చేసింది. 2004లో వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని విజయం సాధించింది. ఆస్ట్రేలియాను 93 పరుగులకే ఆలౌట్ చేసి 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
1981లో మెల్‌బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియాతో 143 పరుగులను డిఫెండ్ చేసుకుంది. ఆసీస్‌ను 83 పరుగులకే పరిమితం చేసి గెలుపొందింది. టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా 107 పరుగుల లక్ష్యాన్ని చేధించడం న్యూజిలాండ్‌కు అంత సులువు కాదని చెప్పాడు. పిచ్‌పై పగుళ్లు ఏర్పడ్డాయని, ఆరంభంలోనే వికెట్లు తీస్తే విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications