For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: టీమిండియాకు బిగ్ షాక్.. రిషభ్ పంత్‌కు తీవ్ర గాయం!(వీడియో)

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుంది టీమిండియా పరిస్థితి. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియాను కష్టాలు వెంటాడుతున్నాయి. పేలవ బ్యాటింగ్‌తో 46 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డ్ నమోదు చేసిన రోహిత్ సేన.. బౌలింగ్‌లోనూ అదే తడబాటును కొనసాగిస్తోంది. మరోవైపు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.

వికెట్ కీపింగ్ చేస్తుండగా బంతి నేరుగా అతని మోకాలికి తగలడంతో పంత్ కుప్పకూలాడు. సర్జరీ అయిన చోటే బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స అందించినా లాభం లేకపోయింది. దాంతో వారి భుజాలపై చేతులు వేసి అతి కష్టంగా పంత్ మైదానం వీడాడు. పంత్ పరిస్థితిని చూస్తుంటే గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

IND vs NZ Big Blow For Team India as Rishabh Pant Walks Off After Injuring His Knee

రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని కాన్వే డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమయ్యాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్ స్టంప్‌కు దగ్గరగా వెళ్తూ రిషభ్ పంత్ కుడి మోకాలికి బలంగా తాకింది. ప్యాడ్స్ కవర్ కాకపోవడం.. రోడ్డు ప్రమాదంలో అక్కడే తీవ్ర గాయం కావడంతో పంత్ కుప్పకూలాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను మైదానం వీడాడు. రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.

ఒకవేళ రిషభ్ పంత్‌కు తీవ్ర గాయమైతే టీమిండియాకు కోలుకోలేని దెబ్బ పడుతోంది. ఈ సిరీస్ కంటే ఆస్ట్రేలియా పర్యటనకు రిషభ్ పంత్ ఉండటం కీలకం. ఈ మ్యాచ్‌లోనూ రిషభ్ పంత్(20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లోనూ రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల పాటు టెస్ట్ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న పంత్.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు. అంతలోనే మళ్లీ గాయపడటం.. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 2 ఫోర్లతో 20), యశస్వి జైస్వాల్(63 బంతుల్లో ఫోర్‌తో 13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/15), విలియమ్ ఓ రౌర్కే(4/22), టీమ్ సౌథీ(1/8) భారత్ పతనాన్ని శాసించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియాకు ఇదే లోయేస్ట్ స్కోర్.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 41 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 161 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(17 బ్యాటింగ్), డారిల్ మిచెల్(4 బ్యాటింగ్) ఉన్నారు. టామ్ లాథమ్(15) విఫలమైనా.. డెవాన్ కాన్వే(91), విల్ యంగ్(33) రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేలా తలో వికెట్ తీసారు.

టామ్ లాథమ్(15) విఫలమైనా.. డేవాన్ కాన్వే(67 బ్యాటింగ్), విల్ యంగ్(24 బ్యాటింగ్) సూపర్ బ్యాటింగ్‌తో 31 ఓవర్లు ముగిసే సరికి 111 పరుగులు చేసింది.

Story first published: Thursday, October 17, 2024, 17:06 [IST]
Other articles published on Oct 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+