IND vs NZ: సంజూ.. టీమిండియాను వదిలేయ్.. ఈ కుళ్లు రాజకీయాలు నీ కెరీర్ నాశనం చేస్తున్నాయ్! ఫ్యాన్స్ ఫైర్

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ కేరళ స్టార్‌కు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కలేదు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం అనంతరం సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్న మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదు.
టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి, వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్లు.. సంజూ శాంసన్‌ను తీసుకోవాలని సూచిస్తున్నా.. టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం పంత్‌నే నమ్ముకుంటుంది. ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించినా పంత్ రాణించలేకపోయాడు. న్యూజిలాండ్ పర్యటనలో అతన్ని ఓపెనర్‌గా ప్రమోట్ చేసి ఆడించినా ఫలితం లేకపోయింది.
పంత్‌కు ఎన్ని అవకాశాలు..?
మూడో టీ20లో అయిన సంజూ శాంసన్‌కు అవకాశం దక్కుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగిన టీమిండియా.. మైదానంకు తగ్గట్లు వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సంజూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లు గడుస్తున్నా.. కెప్టెన్లు మారుతున్నా.. సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడం మాత్రం మారడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిషభ్ పంత్‌కు ఎన్ని అవకాశాలిస్తారని ప్రశ్నిస్తున్నారు. అతని కంటే సంజూ శాంసన్ ఆడించినా జట్టుకు మేలు ఉండేదని కామెంట్ చేస్తున్నారు. సంజూ శాంసన్ పట్ల ఇంత వివక్ష ఏంటో తమకు అర్థం కావడం లేదని, అతను చేసిన పాపం ఏంటని మండిపడుతున్నారు.
రిటైర్మెంట్ తీసుకో..
సంజూకు అవకాశం ఇవ్వకపోవడంపై అసహనానికి గురవుతున్న ఫ్యాన్స్.. రిటైర్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. భారత క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ఇతర దేశాలకు ఆడాలని కోరుతున్నారు. సంజూ శాంసన్‌ను ఏ దేశమైనా తమ తరఫున ఆడిస్తుందని చెబుతున్నారు. అలాగే బిగ్‌బాష్, యూఏఈ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్స్ ఆడే అవకాశం లభిస్తుందని సూచిస్తున్నారు. బీసీసీఐలో ఫేవరెటిజం రాజ్యమేలుతోందని, తమకు నచ్చిన ఆటగాళ్లకే వీలైనన్ని అవకాశాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రెండింగ్‌లో సంజూ శాంసన్..
ఇక కొందరూ రిషభ్ పంత్‌కు ఇచ్చిన అవకాశాలు చేసిన పరుగులతో సంజూ శాంసన్ బ్యాటింగ్ తీరును పోల్చుతున్నారు. పంత్‌కు ఇచ్చిన మద్దతు సంజూ శాంసన్‌కు ఇచ్చి ఉంటే టీమిండియా కెప్టెన్ అయ్యేవాడని కామెంట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు అవకాశాలిచ్చినా రాణించని ఆటగాళ్లను పక్కనపెట్టాలని, సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు అండగా నిలవాలని మరికొందరు సూచిస్తున్నారు. కొందరైతే సంజూ శాంసన్‌ను పక్కనపెట్టేందుకు బీసీసీఐకి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి జట్టులో కూడా సంజూకు చోటు దొరక్కపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టాస్ ఓడిన టీమిండియా..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తాత్కాలిక కెప్టెన్ టిమ్ సౌథీ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. గత మ్యాచ్‌లో కూడా తాము బౌలింగ్ బాగానే చేశామని, ఈ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ సారధి కేన్ విలియమ్సన్ ఆడటం లేదు. గతంలో తీసుకున్న మెడికల్ అపాయింట్‌మెంట్ ఉండటంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆటగాడు మార్క్ చాప్‌మాన్‌ను తీసుకున్నట్లు సౌథీ వెల్లడించాడు. జట్టులో ఒకే ఒక మార్పు ఉందని చెప్పిన టీమిండియా హార్దిక్ పాండ్యా.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications