Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఆర్‌సీబీ అభిమానులను రెచ్చగొట్టిన అంబటి రాయుడు! (వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నా.. అప్పుడే ఈ క్యాచ్ రిచ్ లీగ్‌పై హైప్ క్రియేట్ అయ్యింది. ఓవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతున్నా.. మరోవైపు ఐపీఎల్ 2025 సీజన్‌పై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ మొదలైంది. ఇప్పటికే ఆయా టీమ్స్ ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించి.. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆరంభ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల సేల్ కూడా మొదలుపెట్టాయి.

మరోవైపు మాజీ క్రికెటర్లు తమ మాటలతో ఐపీఎల్ 2025పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్లు అంబటి రాయుడు, సంజయ్ బంగర్ మధ్య ఐపీఎల్ 2025కి సంబంధించి ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

IND vs NZ Ambati Rayudu trolls RCB ahead of IPL 2025

మరోసారి అంబటి రాయుడు ఆర్‌సీబీ అభిమానులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలో ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా పనిచేసిన సంజయ్ బంగర్.. ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. గత నాలుగేళ్లుగా ఆర్‌సీబీ నిలకడగా ఆడుతూ ప్లే ఆఫ్స్ చేరిందని తెలిపాడు. వెంటనే రాయుడు.. ఈ లెక్కన ఈ సారి ఆర్‌సీబీ క్వాలిఫయర్-2 ఆడుతుందా? అని సెటైర్లు పేల్చాడు.

వెంటనే సంజయ్ బంగర్.. ఆర్‌సీబీ అభిమానులు ఈ మ్యాచ్ చూస్తున్నారనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించాడు. దానికి రాయుడు..'అయితే ఏంటీ?.. నన్ను బెదిరిస్తున్నారా? ఏది ఏమైనా ఆర్‌సీబీ అభిమానుల ప్రేమనే'అని నవ్వుతూ పేర్కొన్నాడు. సరదాగా సాగిన ఈ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఓ తెలుగు పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆర్‌సీబీకి టైటిల్ రావద్దని కోరుకుంటానని తెలిపాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ సంచలన ప్రదర్శనతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. దాంతో ఆ జట్టు అభిమానులు టైటిల్ గెలిచినంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాలను తప్పుబట్టిన రాయుడు.. ఆ జట్టు అభిమానుల తీరును తప్పుబట్టాడు. ఈ క్రమంలో కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్‌గా ఆ జట్టు ఓటమిని తట్టుకోలేకపోయిన అతను ఆర్‌సీబీ తీవ్రంగా ట్రోల్ చేశాడు. ఈ క్రమంలోనే మరోసారి ఆర్‌సీబీ ప్రస్తావన రాగా.. తనదైన ఎటకారాన్ని ప్రదర్శించాడు.

Story first published: Sunday, March 9, 2025, 21:44 [IST]
Other articles published on Mar 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+