For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూ.. అతనిలా కాదు.. నీ ఆట నువ్వు ఆడు: రహానే

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే గెలుచుకున్నప్పటికీ సంజూ శాంసన్ వైఫల్యం ఆందోళన రేకెత్తిస్తోంది. కీలక టీ20 ప్రపంచకప్ 2026 ముందు ఓపెనర్ అయిన సంజూ శాంసన్ ఫామ్ కోల్పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ 10, 6, 0 పరుగులే చేశాడు.

అభిషేక్‌‌ను అనుకరించవద్దు..

సంజూ వైఫల్యంపై స్పందించిన టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మను అనుకరించ వద్దని సూచించాడు. సహజసిద్దమైన ఆటనే ఆడాలని సలహా ఇచ్చారు. 'మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడటం చూసి అతనిలానే వేగంగా పరుగులు చేయాలనే ఒత్తిడిలో సంజూ శాంసన్ కనిపిస్తున్నాడు. అభిషేక్ శర్మను సంజూ అనుకరించవద్దు. అతనిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. సంజూ తన సహజ ఆటనే ఆడాలి.

IND vs NZ Ajinkya Rahane Advises Sanju Samson to Regain Confidence Ahead of T20 World Cup 2026

టీమ్ మేనేజ్‌మెంట్ అండగా ఉండాలి..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంజూ అద్భుతంగా ఆడాడు. వేగంగా పరుగులు చేశాడు. ఇక్కడ కూడా అలానే ఆడాలి. అభిషేక్ శర్మతో పోల్చుకోవద్దు. తనపై తాను నమ్మకం ఉంచుకోవాలి. ఈ సమయంలో టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంజూ శాంసన్‌కు అండగా నిలవాలి.

ఈ సిరీస్‌తో పాటు ప్రపంచకప్ టోర్నీలో నువ్వే ఓపెనర్, నీ ప్లేస్‌కు డోకా లేదు అనే భరోసా ఇవ్వాలి. ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నప్పుడు సంజూ శాంసన్‌ భయపడటం సహజం. కానీ అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచి, తనదైన శైలిలో ఆడటానికి అనుమతివ్వాలి. అతను కచ్చితంగా మ్యాచ్ విన్నర్ అవుతాడు.

కాస్త సమయం తీసుకోవాలి..

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఎలా ఆడేవాడో సంజూ గుర్తు చేసుకోవాలి. క్రీజులోకి వచ్చిన వెంటనే తొందరపడి షాట్లు ఆడకుండా క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోవాలి. 15 బంతుల్లో 25, 20 బంతుల్లో 30 పరుగులు చేసినా సరిపోతుంది. దూకుడుగా ఆడే ముందు కాస్త సమయాన్ని క్రీజులో గడపాలి. బౌలింగ్‌ను అంచనా వేయాలి.'అని రహానే సూచించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 16 పరుగులే చేసిన సంజూ.. గత 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 11.55 ఉండగా.. స్ట్రైక్‌రేట్ 133 మాత్రమే.

Story first published: Monday, January 26, 2026, 13:09 [IST]
Other articles published on Jan 26, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+