For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: గవాస్కర్ కాళ్లు మొక్కిన అభిషేక్ శర్మ!(వీడియో)

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. బుధవారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 48 పరుగులతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. అభిషేక్ శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌తో 84) విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కాళ్లను అభిషేక్ శర్మ మొక్కాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. టీమిండియా విజయం ఖాయమైన అనంతరం అభిషేక్ శర్మ మైదానంలోకి వస్తుండగా.. స్టార్ స్పోర్ట్ కామెంటేటర్‌గా ఉన్న గవాస్కర్ కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లిన అభిషేక్ శర్మ కాళ్లను టచ్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. పరుగెత్తుకుంటూ వచ్చి మరీ కాళ్లు మొక్కడం గమనార్హం.

నేను ఖాతా తెరిచేలోపే హాఫ్ సెంచరీ బాదుతున్నాడు..

అనంతరం ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించిన గవాస్కర్.. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో తన ఆటను పోల్చుతూ నవ్వులు పూయించాడు. 'నేను ఖాతా తెరవడానికి 22 బంతులు ఆడితే అభిషేక్ శర్మ అన్ని బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేస్తున్నాడు. అప్పటి క్రికెట్‌కు, ఇప్పటి క్రికెట్‌కు ఎంత తేడా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.'అని గవాస్కర్ అనగా అక్కడ నవ్వులు పూసాయి.

IND vs NZ Abhishek Sharma Touches Sunil Gavaskar s Feet After Match-Winning Knock in Heartwarming Gesture

ఇది ఫియర్‌లెస్ ఆటనే కదా? అని గవాస్కర్ ప్రశ్నించగా.. కాదు అని అభిషేక్ శర్మ బదులిచ్చాడు. పక్కా ప్రణాళికతో కూడిన ఇంటెంట్ అని చెప్పాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే బాధ్యత తనకు ఇచ్చిందని వివరించాడు. తాను రేంజ్ హిట్టింగ్ కంటే టైమింగ్‌పైనే ఎక్కువ ఆధారపడుతానని, నెట్స్‌లో తన షాట్లపై బాగా వర్క్ చేస్తానని తెలిపాడు. తన పాత బ్యాటింగ్ వీడియోలను చూసి ఎలా ఆడాలనేది ప్లాన్ చేసుకుంటానని చెప్పాడు. బౌలర్లు తనను ఎక్కడ టార్గెట్ చేస్తున్నారో, దానికి తగ్గట్లు ఎలా ఆడాలనేదానిపై ఫోకస్ పెడుతానని గవాస్కర్‌కు వివరించాడు.

నీ షాట్ సెలెక్షన్ అద్భుతం..

అనంతరం గవాస్కర్.. అభిషేక్ శర్మ షాట్ సెలెక్షన్‌ను కొనియాడాడు. 'అభిషేక్..నువ్వు బ్యాటింగ్ చేస్తున్న తీరు అమోఘం. నీ షాట్ సెలక్షన్ అద్భుతం. ముఖ్యంగా నువ్వు బంతిని హిట్ చేసేటప్పుడు వచ్చే ఆ టైమింగ్ చూడ ముచ్చటగా ఉంది. నేను నా కెరీర్‌లో తొలి పరుగు తీయడానికి పది బంతులు ఆడేవాడిని. కానీ నువ్వు పది బంతులు ఆడేసరికి 30-40 పరుగులు చేస్తున్నావు. టీ20 క్రికెట్ అంటే ఇలాగే ఉండాలి. నీ ఆటలో కేవలం దూకుడే కాదు. పరిణతి కూడా కనిపిస్తోంది.

భారీ షాట్లు ఆడుతూనే వికెట్ కాపాడుకోవాలనే స్పృహ నీలో ఉండటం జట్టుకు ప్రయోజనంగా మారుతుంది. ఇదే జోరును నువ్వు కొనసాగించాలి. నీలో ఉన్న ఈ సహజమైన ప్రతిభ నిన్ను భారత జట్టులో సుదీర్ఘ కాలం పాటు కొనసాగేలా చేస్తుంది. నిన్ను ఇలా ఆడుతుంటే చూడటం క్రికెట్ అభిమానులందరికీ పండగే.' అని గవాస్కర్ ప్రశంసించాడు.

ఈ ప్రశంసలకు అభిషేక్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు.'మీ లాంటి దిగ్గజాల నుంచి ఇలాంటి మాటలు వినడం నా అదృష్టం సర్. జట్టు కోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే నా లక్ష్యం'అని అభిషేక్ బదులిచ్చాడు.

Story first published: Thursday, January 22, 2026, 14:27 [IST]
Other articles published on Jan 22, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+