న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయడం ఈ సందేహాలకు కారణమైంది. రంజీ ట్రోఫీ 2024లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు తరఫున వాషింగ్టన్ సుందర్ భారీ శతకం నమోదు చేశాడు. దాంతో సెలెక్టర్లు అతన్ని న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్ట్‌లకు ఎంపిక చేశారు.

అశ్విన్‌కు గాయమా..?
అప్పటికే జట్టులో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ ఉన్నాడు. దాంతో అశ్విన్‌కు బ్యాకప్‌గానే వాషింగ్టన్ సుందర్ తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే సందేహం వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అశ్విన్ పూర్తిగా ఫిట్ లేడా? అని ప్రశ్నించాడు.
'వాషింగ్టన్ సుందర్‌ను టీమిండియాలోకి తీసుకున్నారు. ఇది ఏ మాత్రం ఊహించని ఎంపిక. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో అతను సెంచరీ సాధించాడు. తమిళనాడు తరఫున ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సత్తా చాటాడు. తమిళనాడుకే ఆడుతున్న సాయి సుదర్శన్ కూడా డబుల్ సెంచరీ సాధించాడు. కానీ సాయి సుదర్శన్‌ను కాకుండా వాషింగ్టన్ సుందర్‌ను టీమిండియాకు ఎంపిక చేశారు.

నలుగురి స్పిన్నర్లతో ఆడుతారా..?
ఈ నిర్ణయమే ఇప్పుడు సందేహాలకు తావిస్తోంది. సుందర్‌కు తుది జట్టులో చోటిస్తారా? టీమిండియా ఆలోచనలు ఏంటి? టీమిండియా నలుగురు స్పిన్నర్లతో ఆడుతుందా? జట్టులో ఇప్పటికే బెంచ్‌పై కావాల్సిన పేసర్లు ఉన్నారు. అశ్విన్‌కు ఏమైనా ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయా? అందుకే అతనికి చివరి రోజు ఆటలో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇచ్చారా?
అది కూడా మ్యాచ్ చేజారిన తర్వాత అశ్విన్‌తో బౌలింగ్ చేయించారు. చివర్లో అశ్విన్ బౌలింగ్ చేయించడం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అతనికి బౌలింగ్ ఇవ్వలేదంటే ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు లెక్క. అతనిలా బౌలింగ్ చేసే సామర్థ్యం వాషింగ్టన్ సుందర్‌కు ఉందని భావిస్తున్నారా?'అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్ట్ పుణే వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానుంది.