IND vs NZ 3rd Test: ‘మీకో దండం రా అయ్యా.. నా వల్ల కాదు’-విరాట్ కోహ్లీ! (వీడియో)
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా శుక్రవారం ఫ్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఫీల్డింగ్ చేస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించే ప్రయత్నం చేశాడు.
అభిమానులు పాడిన 'మై నేమ్ ఈజ్ లకాన్'అనే హిందీ పాటకు కాలు కదిపి వారిని సంతోషపరిచాడు. కోహ్లీ రెస్పాన్స్‌తో రెచ్చి పోయిన అభిమానులు ఆ పాటను మరింత గట్టిగా పాడారు. ఫ్యాన్స్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న విరాట్ కోహ్లీ.. వారికి దండం పెట్టాడు. 'మీకో దండం రా అయ్యా.. నా వల్ల కాదు'అని ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

'ఏదో మీరు సంతోష పడుతారని కాలు కదిపితే.. మళ్లీ మళ్లీ డ్యాన్స్ చేయమంటార్రేంట్రా'అనే రితీలో రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Wankhede crowd sings 'My Name Is Lakhan'
— Sameer Allana (@HitmanCricket) November 1, 2024
Virat Kohli responds in the end. 🙏🏻 #INDvNZ pic.twitter.com/95Dq9HFiC9
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లతో 18) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అనూహ్యమైన బౌన్స్‌ను ఆడలేక మూల్యం చెల్లించుకున్నాడు. క్రీజులో జైస్వాల్‌తో పాటు శుభ్‌మన్ గిల్ ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications