Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: రఫ్ఫాడించిన రవీంద్ర జడేజా.. !

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(5/65) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్(4/81) నాలుగు వికెట్లు తీయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత పేసర్ ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.

చెలరేగిన సుందరం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను ఆకాశ్ దీప్‌ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన విల్ యంగ్‌తో మరో ఓపెనర్ టామ్ లాథమ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర(5)ను కూడా సుందర్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు.

IND vs NZ 3rd Test Ravindra Jadeja Washington Sundar Help India Bowl Out New Zealand For 235

దాంతో 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన విల్ యంగ్, డారిల్ మిచెల్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యారు. దాంతో కివీస్ 92/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రఫ్ఫాడించిన జడేజా..
రెండో సెషన్‌లో ఈ జోడీ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఓపికగా ఆడుతూ.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఈ క్రమంలో విల్ యంగ్ 94 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో డారిల్ మిచెల్ సైతం సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీసాడు.

విల్ యంగ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి నాలుగో వికెట్‌కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అదే ఓవర్‌లో టామ్ బ్లండెల్(0)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటి గ్లేన్ ఫిలిప్స్(7) కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు డారిల్ మిచెల్ 90 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ 192/6 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

మూడో సెషన్ ఆరంభంలోనే ఇష్ సోదీ(7)ని జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. సెంచరీ దిశగా సాగిన డారిల్ మిచెల్‌ను సుందర్ పెవిలియన్ చేర్చాడు. మ్యాట్ హెన్రీ(7)ని క్లీన్ బౌల్డ్ చేసిన జడేజా ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. ఆజాజ్ పటేల్(1)ను సుందర్ ఔట్ చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

Story first published: Friday, November 1, 2024, 15:54 [IST]
Other articles published on Nov 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+