IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?

హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో సిరీస్ డిసైడర్‌కు దారి తీసింది. దాంతో అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ విరామంతో తర్వాత ఈ సిరీస్‌కు టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పృథ్వీ షా పరుగుల వరద పారించడంతో అతనికి 18 నెలల నిరీక్షణ తర్వాత టీమిండియా పిలుపు అందింది.
2021లో ఆస్ట్రేలియా పర్యటనలో చివరిసారిగా ఆడిన షా అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వీ షా.. తుది జట్టులో ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించలేదు. దాంతో మూడో టీ20లోనైనా అతన్ని తీసుకోవాలని, అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పృథ్వీ షాను తుది జట్టులోకి తీసుకోమనేందుకు మూడు బలమైన కారణాలున్నాయని చెబుతున్నారు.

పృథ్వీ షా డాషింగ్ ఓపెనర్..
వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో ఆడే పృథ్వీ షాకు టీమ్‌మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. టీ20ల్లో పవర్ ప్లే చాలా కీలకమని, పృథ్వీ షా తొలి 6 ఓవర్లలో ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగుతాడని పేర్కొంటున్నారు.
షా తరహా ఓపెనర్ లేకనే టీమిండియా గత రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో విఫలమైందని గుర్తు చేస్తున్నారు. కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం.. రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై కూడా ప్రభావం చూపిందని, సెహ్వాగ్ తరహా డాషింగ్ ఓపెనర్ టీమిండియాకు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఆ స్థానాన్ని పృథ్వీ షా భర్తీ చేయగలడని, అతను విఫలమైనా.. వరుస అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.

సూపర్ ఫామ్‌లో షా..
ప్రస్తుతం పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రంజీ ట్రోఫీలో అస్సాంపై 379 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడని పేర్కొంటున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 36.88 యావరేజ్‌తో 332 పరుగులు చేశాడని, స్ట్రైక్‌రేట్ 131.52 ఉందని గణంకాలతో సహా వివరిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం టీమిండియాలో ఉన్న మరే ఓపెనర్ కూడా పృథ్వీ షాలా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయలేని సవాల్ విసురుతున్నారు.

శుభ్‌మన్ గిల్, ఇషాన్ చెత్తాట...
వన్డేల్లో దుమ్మురేపుతున్న శుభ్‌మన్ గిల్ టీ20ల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లోనూ శుభ్‌మన్ విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా దారుణంగా ఆడుతున్నారు.
గత 13 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేశారనే ఈ ఇద్దరినీ టీ20ల్లో కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని మూడో టీ20కి పక్కనపెట్టి పృథ్వీ షాను ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications