భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మరోసారి అద్భుత బౌలింగ్‌తో టీమిండియాను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన న్యూజిలాండ్.. అనంతరం సాధికారికంగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. మరోవైపు పేలవ బ్యాటింగ్.. రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ టీమిండియా కొంపముంచాయి.
న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(133 బంతుల్లో 10 ఫోర్లతో 86) హాఫ్ సెంచరీతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. క్రీజులో టామ్ బ్లండెల్(30 బ్యాటింగ్) తో పాటు గ్లేన్ ఫిలిప్స్(9 బ్యాటింగ్) ఉన్నాడు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆధిక్యం 301 పరుగులకు చేరింది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం కష్టం. మూడో రోజు ఆటలో న్యూజిలాండ్ 50-100 పరుగులు జోడించినా.. ఈ టర్నింగ్ వికెట్‌పై లక్ష్యాన్ని చేధించడం కష్టం.

చెత్త కెప్టెన్సీ.. పేలవ బ్యాటింగ్..
రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ న్యూజిలాండ్‌కు కలిసిరాగా.. టీమిండియా కొంపముంచింది. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే డిఫెన్సివ్ ఫీల్డ్ సెటప్‌తో రోహిత్ టీమిండియాకు నష్టం చేశాడు. అంతకుముందు 16/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్‌తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38), యశస్వి జైస్వాల్(30), శుభ్‌మన్ గిల్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
నిరాశపర్చిన కోహ్లీ, పంత్
విరాట్ కోహ్లీ(1), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(18), సర్ఫరాజ్ ఖాన్(11),రవిచంద్రన్ అశ్విన్(4), రవీంద్ర జడేజా(38), ఆకాశ్‌దీప్(6), జస్‌ప్రీత్ బుమ్రా(0) దారుణంగా విఫలమయ్యారు. డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో బ్యాటింగ్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. రెండో రోజు టీమిండియా 140 పరుగులు చేసి చివరి 9 వికెట్లు కోల్పోయింది. దాంతో న్యూజిలాండ్‌కు 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.