న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. గురువారం పుణె వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన టీమిండియా.. అనంతరం ఆచితూచి బ్యాటింగ్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ(0) డకౌటవ్వగా.. యశస్వి జైస్వాల్(6 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్(10 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ ఓ వికెట్ తీసాడు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.

అశ్విన్-సుందరం..
డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిచెల్ సాంట్నర్(51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ ఆఫ్ స్పిన్నర్లే 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.
దెబ్బతీసిన అశ్విన్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు టామ్ లాథమ్(15), డెవాన్ కాన్వే నిదానంగా నడిపించారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని అశ్విన్ విడదీసాడు. తన తొలి ఓవర్‌లోనే టామ్ లాథమ్(15) వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన విల్ యంగ్ కూడా జిడ్డు బ్యాటింగ్‌తో కాన్వేకు అండగా నిలిచాడు.
అతన్ని అశ్విన్ కీపర్ క్యాచ్‌గా బోల్తా కొట్టించాడు. ఈ వికెట్ విషయంలో ముందుగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కానీ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్ శర్మతో పట్టుబట్టి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకినట్లు తేలడంతో విల్ యంగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి రచిన్ రవీంద్ర రాగా.. న్యూజిలాండ్ 92/2 లంచ్‌బ్రేక్‌కు వెళ్లింది.
మలుపు తిప్పిన సుందరం..
సెకండ్ సెషన్‌లో డెవాన్ కాన్వే 109 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రచిన్‌తో కలిసి ఆచితూచి ఆడిన అతను సెంచరీ దిశగా మారాడు. క్రీజులోప్రమాదకరంగా మారిన ఈ జోడీని అశ్విన్ విడదీసాడు. కాన్వేను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
కాన్వే ఔటైనా.. టామ్ బ్లండెల్‌తో కలిసి డారిల్ మిచెల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 59 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీసాడు. స్టన్నింగ్ డెలివరీతో రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ న్యూజిలాండ్ పతనాన్ని శాసించింది.
టామ్ బ్లండెల్‌ను కూడా ఇదే తరహాలో సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 201/5 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. చివరి సెషన్‌లోనూ వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. డారిల్ మిచెల్(18), టామ్ బ్లండెల్(3), గ్లేన్ ఫిలిప్స్(9), మిచెల్ సాంట్నర్(33), టీమ్ సౌథీ, ఆజామ్ పటేల్‌లను పెవిలియన్ చేర్చి న్యూజిలాండ్‌ను తక్కవ స్కోర్‌కే పరిమితం చేశాడు.