చెలరేగిన జెమీసన్.. భారత్ 242 ఆలౌట్

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. ఆతిథ్య యువ బౌలర్ కైలీ జెమీసన్(5/45) ఐదు వికెట్లతో మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. ఓపెనర్ పృథ్వీషా(54), చతేశ్వర్ పుజారా(53), హనుమ విహారి(55) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. ప్రత్యర్థి బౌలర్లలో జేమీసన్ ఐదు వికెట్లకు తోడుగా.. సౌథీ, బోల్ట్ రెండేసి వికెట్లు పడగొట్టారు, వాగ్నర్ ఒక వికెట్ తీశారు.
భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ(3)తో సహా మయాంక్ అగర్వాల్(7), అజింక్యా రహానే(7), రిషభ్ పంత్(12), జడేజా(9), ఉమేశ్ యాదవ్(0) దారుణంగా విఫలమయ్యారు. పుజారా, విహారిలు ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ 200పై చిలుకు పరుగులు చేయగలిగింది. చివర్లో మహ్మద్ షమీ(16) వరుస సిక్సర్లతో అలరించాడు. బుమ్రా(10) నాటౌట్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications