For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ 2nd T20 records: అర్ష్‌దీప్‌కు షాక్: టీమిండియాకు కిక్: ఒకే మ్యాచ్.. ఎన్నో రికార్డులు!

IND vs NZ 2nd T20 records: రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.


ఈ మ్యాచ్‌లో నమోదైన ప్రధాన రికార్డులు, విశేషాలు ఇవే..

1. అత్యంత వేగంగా ఛేజింగ్ రికార్డు

టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 209 పరుగులను మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారత్ పూర్తి చేసింది. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్(24 బంతులు) పేరిట ఉండేది.

IND vs NZ 2nd T20 records India Smashes Records with 7-Wicket Win Ishan Kishan Fast Fifty

2.ఇషాన్ కిషన్ 'ఫాస్టెస్ట్' ఫిఫ్టీ

చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌పై వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఇషాన్ మొత్తం 32 బంతుల్లో 76 పరుగులు చేసి విజయానికి పునాది వేశాడు.

3. కెప్టెన్ సూర్య కమ్‌బ్యాక్

దాదాపు 463 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫేవరెట్ ఫార్మాట్‌లో అర్ధశతకం బాదాడు. ఓపెనర్లు త్వరగా ఔటైప్పటికీ, సూర్య తనదైన శైలిలో ఆడి జట్టును గెలిపించాడు.

4.టీమిండియా 100వ హోం మ్యాచ్

భారత గడ్డపై టీమిండియా ఆడిన 100వ టీ20 మ్యాచ్ ఇది కావడం విశేషం. ఈ మైలురాయి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

5. అర్ష్‌దీప్ సింగ్ 'అన్‌వాంటెడ్' రికార్డు

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓచేదు జ్ఞాపకం కూడా మిగిలింది. స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన మొదటి ఓవర్‌లోనే 18 పరుగులు ఇచ్చాడు. భారత్ తరపున టీ20ల్లో తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా ఆయన ఓచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.


6.మొదటి స్థానంలో ఆస్ట్రేలియా

మరోవైపు 200+ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడం ఇది 6వ సారి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (7 సార్లు) మొదటి స్థానంలో ఉంది.

మ్యాచ్ కొనసాగిందిలా..

రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్), ఇషాన్ కిషన్(32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76) ఊచకోతతో భారత ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్(27 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), రచిన్ రవీంద్ర(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/35) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఓపెనర్లు సంజూ శాంసన్(6), అభిషేక్ శర్మ(0) విఫలమైనా.. ఇషాన్ కిషన్, సూర్య, శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకోబ్ డఫీ, ఇష్ సోధీ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 ఆదివారం గౌహతి వేదికగా జరగనుంది.

Story first published: Saturday, January 24, 2026, 9:56 [IST]
Other articles published on Jan 24, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+