Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: సిరాజ్ ఔట్.. ‘పర్పుల్’ పటేల్ అరంగేట్రం! లక్ అంటే రోహిత్‌దే!

India hand debut to Harshal Patel

రాంచీ: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అంతేకాకుండా రాంచీలో చేజింగ్‌కు అనుకూలిస్తుందని, తమ ఆటగాళ్లకు కూడా మ్యాచ్‌ను ముగించడం ఎలానో తెలుస్తుందన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన తమ జట్టు ఉత్సాహంగా బరిలోకి దిగుతుందని చెప్పాడు. ఎప్పుడెప్పుడు తమ సత్తాను నిరూపించుకుందామా? అని యువ ఆటగాళ్లంతా సిద్దంగా ఉన్నారని తెలిపాడు. అయితే తుది జట్టులో ఓ మార్పు జరిగిందని, గత మ్యాచ్‌లో గాయపడ్డ మహమ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్‌ తుది జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

ఐపీఎల్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి భారత జట్టులో చోటు దక్కించుకున్న పర్పుల్ పటేల్ అలియాస్ హర్షల్ పటేల్.. అజిత్ అగార్కర్ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. పూర్తిస్థాయిలో టీ20 సారథ్య బాథ్యతలు అందుకున్న రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలవడం గమనార్హం. దాంతో నెటిజన్లు.. రోహిత్ లక్ అంటే నీదనయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరోవైపు మంచు ప్రభావం నేపథ్యంలో తాము కూడా ఫీల్డింగే ఎంచుకోవాలనుకున్నామని న్యూజిలాండ్ తాత్కలిక సారథి టీమ్ సౌథీ తెలిపాడు. అయినప్పటికీ ఈ సవాల్‌ను స్వీకరిస్తామని, సానుకూల దృక్పథంతో విజయం కోసం పోరాడుతామని చెప్పాడు. మంచు ప్రభావానికి తగ్గట్ల ఆడుతామని చెప్పాడు. జట్టులో మూడు మార్పులు చేశామని ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, ఇష్ సోదీ‌లు జట్టులోకి రాగా.. ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర, అస్ట్లే ఉద్వాసనకు గురయ్యారని చెప్పాడు.

తొలి టి20లో విజయం సాధించిన భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు టి20 ప్రపంచకప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలిచేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం.

తుది జట్లు:
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్‌ అయ్యర్, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్, అశ్విన్, భువనేశ్వర్, హర్షల్ పటేల్.

న్యూజిలాండ్‌: టీమ్ సౌతీ (కెప్టెన్‌), మార్టిన్ గప్టిల్, డారిల్‌ మిచెల్, చాప్‌మన్, ఫిలిప్స్, సీఫెర్ట్, నీషమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, ఫెర్గూసన్, ఇష్‌ సోధి.

Story first published: Friday, November 19, 2021, 18:56 [IST]
Other articles published on Nov 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+