IND vs NZ 2nd T20: చెలరేగిన రోహిత్, రాహుల్.. భారత్‌దే సిరీస్!

రాంచీ: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ రెండింతల ప్రతీకారం తీర్చుకుంది. సొంత గడ్డపై జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన భారత్.. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. కివీస్ బ్యాటింగ్‌లో మార్టిన్ గప్టిల్(31), డారిల్ మిచెల్(31), గ్లేన్ ఫిలిప్స్(34) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. కివీస్ ఓపెనర్ల ధాటైన ఇన్నింగ్స్‌తో ఓ దశలో 190+ రన్స్ చేస్తుందనుకున్న న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా హర్షల్ పటేల్, స్పిన్నర్లు అదరగొట్టారు.

చెలరేగిన రోహిత్, రాహుల్..
అనంతరం భారత్ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 155 రన్స్ చేసి మరో 16 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్(49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65), రోహిత్ శర్మ(36 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. వెంకటేశ్ అయ్యర్(11 బంతుల్లో 2 ఫోర్లతో 12 నాటౌట్), రిషభ్ పంత్(6 బంతుల్లో 2 సిక్స్‌లతో 12 నాటౌట్) తమదైన శైలిలో మ్యాచ్‌ను ముగించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. ఇతర బౌలర్లు విఫలమయ్యారు.

సూపర్ స్టార్ట్..
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌నే బౌండరీకి తరలించిన రాహుల్.. ఘనంగా ఆరంభించాడు. అదే జోరును కొనసాగిస్తూ రాహుల్ బౌండరీలు బాదుతుంటే మరోవైపు రోహిత్ శర్మ అతనికి అండగా నిలిచాడు. యాంకర్ రోల్ పోషిస్తూ.. సింగిల్స్‌తో రాహుల్‌కు స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో రాహుల్ ఓ బౌండరీ బాదగా.. రోహిత్ భారీ సిక్స్‌తో బౌండరీల ఖాతా తెరిచాడు. బౌల్ట్ బౌలింగ్‌లో రాహుల్ కూడా ఓ సిక్స్ కొట్టడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 45 రన్స్ చేసింది. ఆ తర్వాత సౌథీ స్పిన్నర్లను బరిలోకి దించగా.. భారత జోడీ స్మార్ట్‌గా బ్యాటింగ్ చేసింది.

స్మార్ట్ బ్యాటింగ్..
క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో రన్ రేట్ తగ్గకుండా ఆడింది. సాంట్నర్ వేసిన 10వ ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదిన రోహిత్.. అదే ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడగా బౌల్ట్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో రోహిత్ చెలరేగిపోయాడు. మిల్నే వేసిన మరుసటి ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా భారీ సిక్స్ బాదిన రాహుల్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన రాహుల్.. న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రాహుల్.. గ్లేన్ ఫిలిప్స్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

పంత్.. విన్నింగ్ షాట్..
బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందిన వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి హిట్ మ్యాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మిల్నే వేసిన 15 ఓవర్‌లో చివరి బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సౌథీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే రోహిత్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(1) సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన పంత్.. జిమ్మీ నీషమ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications