న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KS Bharat: 12 నిమిషాల్లోనే మ్యాచ్​కు సిద్ధమవ్వాలన్నారు!

IND vs NZ 2021: KS Bharat Had Some 12 Minutes To Get Ready

కాన్పూర్: టీమిండియా వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా వచ్చిన తెలుగు కుర్రాడు, ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్.. కీపింగ్‌లో అదరహో అనిపించాడు. సాహాకు ఉన్న 11 ఏళ్ల అంతర్జాతీయ అనుభవాన్ని ఒకే ఒక్క మ్యాచ్‌తో పక్కన పెట్టేలా చేశాడు. రిషభ్ పంత్ రాకతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొన్న 37 ఏళ్ల సాహాకు ఇప్పుడు భరత్ సెకండ్ వికెట్ కీపర్ చాన్స్ కూడా లేకుండా చేశాడు. శనివారం ఆటకు ముందు మెడకండరాలు పట్టేయడంతో సాహా మైదానంలోకి రాలేదు.

సూపర్ కీపింగ్‌తో..

సూపర్ కీపింగ్‌తో..

అతని స్థానంలో భరత్ గ్లోవ్స్ అందుకున్నాడు. పిచ్‌పై వేరియబుల్ బౌన్స్ ఉండటంతో బాల్ ఎలా వస్తుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఒకటి రెండు సార్లు లో లెంగ్త్‌లో వచ్చిన చోటే అనూహ్యంగా బౌన్స్ అవుతున్నాయి. ఈ టైమ్‌లో పెద్దగా ఇంటర్నేషన‌ల్ అనుభవం లేని భరత్.. సూపర్ కీపింగ్‌తో అలరించాడు. ఈ క్రమంలో రెండు భిన్నమైన క్యాచ్‌లతో పాటు ఓ స్మార్ట్ స్టంపింగ్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. అశ్విన్ బౌలింగ్‌లో యంగ్ ఇచ్చిన క్యాచ్ చాలా లెంగ్త్‌తో వచ్చింది. ఇక రాస్ టేలర్ క్యాచ్ అనూహ్యంగా బౌన్స్ అయ్యింది. ఈ రెండింటిని భరత్ సూపర్భ్‌గా అందుకున్నాడు. లాథమ్‌ను స్టంప్ చేసిన తీరు ఆటకే హైలైట్.

 12 నిమిషాల్లోనే..

12 నిమిషాల్లోనే..

బౌన్స్ బాల్‌ను చాక‌చక్యంగా అందుకోవడంతో పాటు రెప్పపాటులో బెయిల్స్‌ను పడగొట్టాడు. గత మూడేళ్లుగా భారత్-ఏకురెగ్యులర్‌గా ఆడుతున్న 28 ఏళ్ల భరత్.. ఇప్పుడిప్పుడే తన స్కిల్స్‌ను మెరుగుపర్చుకుంటున్నాడు. అయితే 12 నిమిషాల్లోనే తనను కీపింగ్ సిద్దంగా ఉండమని చెప్పారని భరత్ తెలిపాడు. 'ఉదయం నేను నా రోజూ వారి పని చేసుకుంటున్నా. అంతలోనే సహాయ సిబ్బంది వచ్చి మ్యాచ్​కు సిద్ధమవ్వమని చెప్పారు. కేవలం 12 నిమిషాల్లోనే రెడీగా ఉండాలన్నారు. నేను మైదానంలోకి వచ్చే సమయానికి బంతి చాలా కిందకు వస్తోంది. అందుకు తగ్గట్లు నేను నా పొజిషన్​ను మార్చుకున్నా.'అని శ్రీకర్ భరత్ చెప్పుకొచ్చాడు.

 రాబోయే రోజుల్లో..

రాబోయే రోజుల్లో..

'ఫైనల్ ఎలెవన్‌లో లేకున్నా.. సడెన్‌గా వచ్చి పెర్ఫామెన్స్ చేయడమంటే మాటలు కాదు. ఈ రోజు ఆటలో భరత్ ఆకట్టుకున్నాడు. అతను బాల్స్‌ను అందుకున్న తీరు క్యాచ్‌లు పట్టిన విధానం, స్టంపింగ్ చేసిన తీరు చాలా బాగున్నాయి. రాబోయే రోజుల్లో మరింత రాటుదేలుతాడు'అని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్​లో కివీస్‌ ఓపెనర్లు లాథమ్‌ (95), విల్‌ యంగ్ (89), రాస్‌ టేలర్‌ (11) ఔట్‌లో భరత్‌ కీలక పాత్ర పోషించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 296 పరుగులకు కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్ భారత్ తడబడగా.. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో మళ్లీ ఆదుకున్నాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్ 345 ఆలౌట్

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్

భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 163/6

Story first published: Sunday, November 28, 2021, 14:25 [IST]
Other articles published on Nov 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X